చేనేతకు చేయూతనిద్దాం.. నారా భువనేశ్వరి!
posted on Sep 28, 2024 10:28PM

‘‘తెలుగు రాష్ట్రాల ప్రజలకి నా హృదయపూర్వక నమస్కారాలు.. దసరా శుభాకాంక్షలు. నా ‘నిజం గెలవాలి’ పర్యటన సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా నేను తిరిగినప్పుడు చేనేత కార్మికులు చాలామందిని కలిసి, వాళ్ళు పడే ఇబ్బందులు, కష్టాలను నేను తెలుసుకున్నాను. చేనేత వస్త్రాలు మన తెలుగు రాష్ట్రాల్లో మంగళగిరి, వెంకటగిరి, ఉప్పాడ, పోచంపల్లి, సిరిసిల్ల, గద్వాల్ ఖాదీ ప్రసిద్ధి చెందినవి. నూలు సేకరించినప్పటి నుంచి బట్ట నేసేవరకూ ఆ కార్మికుడు పడే కష్టాలు, ఇబ్బందులు ఎన్నో. అతను యాసిడ్, బ్లీచింగ్ మధ్య నిల్చుని ఆరోగ్యాన్ని కూడా లెక్కచేయకుండా చేనేత కార్మికులు వస్త్రాలు రూపొందిస్తున్నారంటే మనమంతా ఒకటే ఆలోచించాలి. తమ బిడ్డల కోసం, తమ కుటుంబం కోసం చేనేత ఇన్ని సమస్యలు ఎదుర్కొని ముందుకు వెళుతున్నారు. అందుకే నేతన్నలకు సంఘీభావంగా రాబోయే పండుగలకు మనం చేనేత వస్త్రాలను ధరిద్దాం. చేనేత వస్త్రాలు కొనుగోలు చేయడం ద్వారా నేతన్నల ఆనందంలో మనం కూడా పాలుపంచుకుందాం. మన చేనేత, మన సంస్కృతి, మన సంప్రదాయం’’ అంటూ నారా భువనేశ్వరి వివరించారు.