తెలంగాణలో బాలకృష్ణ షెడ్యూల్

 

నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ తెలంగాణలో ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు. ఈ మేరకు షెడ్యూల్ ఖరారైంది. ఐదు రోజుల పాటు బాలయ్య ప్రచారంలో పాల్గొననున్నారు. నవంబర్ 30న కూకట్‌పల్లిలో నందమూరి సుహాసినీకి మద్దతుగా ప్రచారం చేయనున్నారు. డిసెంబర్ 1న శేరిలింగంపల్లి, డిసెంబర్ 2న ఖమ్మం, సత్తుపల్లి, ఆశ్వరావుపేట నియోజకవర్గాల్లో బాలకృష్ణ ప్రచారం నిర్వహించనున్నారు. అలాగే డిసెంబర్ 3న మహబూబ్‌నగర్, మక్తల్, 4న రాజేంద్రనగర్, ఇబ్రహీంపట్నం, ఉప్పల్, సనత్‌నగర్ అభ్యర్థుల తరుపున బాలయ్య ప్రచారం చేయనున్నారు. గతంలో బాలయ్య ఖమ్మం జిల్లాలో చేపట్టిన ర్యాలీకి భారీ స్పందన వచ్చిన సంగతి తెలిసిందే. ఆ ర్యాలీతో కార్యకర్తల్లో నూతనోత్సహం నింపారు. దీంతో టీటీడీపీ నేతలు మరి కొన్ని కీలక నియోజకవర్గాల్లో ప్రచారం చేయవలసిందిగా బాలయ్యను కోరారు. ఈ మేరకు షెడ్యూల్ ఖరారు చేశారు.