విశాఖ మేయర్ ముక్కా శ్రావణి తండ్రి కన్నుమూత: కన్నీరుమున్నీరైన శ్రావణి.!
Published on: Fri Nov 20, 2026 10:08AM

విశాఖపట్నం మేయర్‌గా ఎన్నికైన ముక్కా శ్రావణి కుటుంబంలో విషాదం చోటు చేసుకుది. తన కుమార్తె నగర ప్రథమ పౌరురాలిగా ప్రమాణ స్వీకారం చేసే ఘట్టాన్ని కళ్లారా చూడకముందే ఆమె తండ్రి, మాజీ కార్పొరేటర్ ముక్కా ముత్యాల నాయుడు కన్నుమూశారు. ఒకవైపు అత్యున్నత పదవి దక్కిన ఆనందం, మరోవైపు ఆ విజయానికి వెన్నుదన్నుగా నిలిచిన తండ్రిని కోల్పోయిన దుఃఖం ఏకకాలంలో ఆ కుటుంబాన్ని చుట్టుముట్టాయి. ముక్కా ముత్యాల నాయుడు శుక్రవారం (నవంబర్ 20) ఉదయం అస్వస్థతకు గురయ్యారు. దీంతో కుటుంబ సభ్యులు ఆయనను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. అయితే చికిత్స పొందుతూ ఆయన తుది శ్వాస విడిచారు.
ముక్కా ముత్యాల నాయుడు విశాఖపట్నం నగర రాజకీయాల్లో గుర్తింపు ఉన్న నాయకుడు. 2000లో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆయన కార్పొరేటర్‌గా గెలుపొంది ప్రజలకు సేవలందించారు. ప్రజా సమస్యల పరిష్కారంలో చురుగ్గా వ్యవహరిస్తూ నగర రాజకీయాల్లో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్నారు.
తండ్రి ప్రజాసేవా స్ఫూర్తి, రాజకీయ అనుభవం కుమార్తె ముక్కా శ్రావణి రాజకీయ ప్రస్థానానికి బలమైన పునాది వేశాయి. తండ్రి అందించిన ప్రోత్సాహం, మార్గదర్శకత్వంతో ఆమె రాజకీయాల్లో అడుగుపెట్టి, నేడు విశాఖపట్నం నగర మేయర్ స్థాయికి ఎదిగారు.

ముత్యాల నాయుడు మరణవార్త తెలియగానే విశాఖపట్నం రాజకీయ వర్గాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. పలువురు ప్రజాప్రతినిధులు, నాయకులు, స్థానిక ప్రజలు ఆయన మృతి పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ సంతాపం ప్రకటిస్తున్నారు. ప్రజాప్రతినిధిగా ఆయన చేసిన సేవలను గుర్తుచేసుకుంటూ, శ్రావణికి, ఆమె కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నారు.
ఇది కూడా చదవండి: విశాఖపట్నం మేయర్‌గా ముక్కా శ్రావణి ఘన విజయం
ఒక సాధారణ కార్పొరేటర్‌గా ప్రస్థానం ప్రారంభించిన తండ్రి, తన కుమార్తె ఏకంగా నగర మేయర్ పీఠాన్ని అధిరోహించడాన్ని చూడాలని ఎంతో ఆశపడ్డారు. తాను తన తండ్రి కలను నెరవేర్చాననీ, అయితే తాను మేయర్ గా ప్రమాణ స్వీకారం చేయడం చూడకుండానే ఆయన కన్నుమూయడం విషాదకరమణి ముక్కా శ్రావణి కన్నీరుమున్నీరయ్యారు.

తండ్రి భౌతికంగా తోడులేకపోయినా, ఆయన నేర్పిన ప్రజాసేవా విలువలు, ఆశీస్సులు తనకు అండగా ఉంటాయని శ్రావణి పేర్కొన్నారు ముత్యాలనాయుడి మరణ వార్త తెలియగానే పలువురు రాజకీయ ప్రముఖులు, ఆయన కుటుంబ శ్రేయోభిలాషులు సంతాపం తెలుపుతూ ఈ దుఃఖాన్ని తట్టుకునే మనోధైర్యాన్ని ఆ కుటుంబానికి ప్రసాదించాలని ప్రార్థిస్తున్నారు.
మీకు నచ్చవచ్చు: క్లీన్ స్వీప్ కూటమి లక్ష్యం.. స్థానిక సమరంపై తెలుగుదేశం, జనసేన, బీజేపీ కీలక భేటీ.!
కోనసీమలో వైసీపీకి కోలుకోలేని దెబ్బ: మునిసిపల్, పరిషత్ ఎన్నికలలో ఘోర పరాజయం.!
[Mukka Muthyala Naidu, Death, Mukka Sravani, VizagMayor, Father, Formercorporator, TeluguOne]


