అందరి వాడు వెంకయ్య..వీడ్కోలు సభలో మోడీ ప్రశంసలు

భార‌త ఉప‌రాష్ట్ర‌ప‌తిగా, రాజ్య‌స‌భ చైర్మ‌న్‌గా వెంక‌య్య‌నాయుడు ఎంతో స‌మర్ధ‌వంతంగా ప‌నిచేశార‌ని, పార్ల‌మెంటు ఉభ‌య‌స‌భలూ అల్ల‌ర్లూ, గోల‌తో స‌భా కార్య‌క్ర‌మాలు నిలిచిపోవ‌డ‌మ‌న్న‌ది ప‌రిమితి మించితే అది స‌భా ఉల్లంఘన అవుతుంద‌ని అభిప్రాయ‌ప‌డ్డార‌ని ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ అన్నారు. ఉప‌రాష్ట్ర‌ప‌తి వెంక‌య్య‌నాయుడు కు సోమ‌వారం వీడ్కోలు స‌భ‌లో ప్ర‌ధాని మోదీ ప్ర‌సంగించారు.

ఈ సందర్భంగా ఆయన వెంకయ్యను అందరివాడుగా అభివర్ణించారు. వెంక‌య్య‌నాయుడు త‌న హాస్య‌చ‌తుర‌త‌తో కూడిన ప్ర‌సంగాల‌తో అయిదేళ్ల ప‌ద‌వీ కాలంలో అంద‌రి హృద యాలూ గెలుచుకున్నార‌ని ప్ర‌ధాని ప్ర‌శంసించారు.  ఉప‌రాష్ట్ర‌ప‌తిగా  వెంక‌య్య‌నాయుడు ఐదేళ్ల‌ ప‌ద‌వీ కాలం ఈ నెల ప‌దో తేదీతో ముగియ‌నున్న‌ సంగతి విదితమే. ఈ సంద‌ర్భంగా పార్ల‌మెంటులో సోమ‌వారం జరిగిన వీడ్కోలు సమావేశంలో  ప్ర‌ధాని మాట్లాడారు. ఆయ‌న రాజ్య‌స‌భ చైర్మ‌న్‌గా ఉన్న‌కాలంలో స‌భా కాలం  70 శాతం మించి నిరాటంకంగా సాగిందని ప్ర‌ధాని అన్నారు  

ఆయన స‌భ‌ను  నిర్వహించిన ప‌ద్ధ‌తి, స‌భ్యుల ప‌ట్ల ప్ర‌ద‌ర్శిం చిన మ‌ర్యాద‌, ఆయ‌న అన్ని ప‌క్షాల నుంచి పొందిన గౌర‌వ‌మ‌ర్యాద‌లు మున్ముందు స‌భ‌ను నిర్వ‌హించే వారికి ఎంతో ఆద‌ర్శ‌ప్రాయంగా నిలుస్తుంద‌ని ప్ర‌ధాని మోదీ ప్ర‌శంసించారు

. ప్ర‌భుత్వం ప్ర‌తిపాదించాలి, విప‌క్షాల విభేదించాలి, స‌భలో భారీ చ‌ర్చ‌లు జ‌ర‌గాలి ఈ సంప్ర‌దాయం కొన‌సాగాల‌ని రాజ్య‌స‌భ చైర్మ‌న్‌గా వెంకయ్య  ఆశించార‌న్నారు. మ‌రీ ముఖ్యంగా ఆయ‌న‌కు భార‌తీయ భాష‌ల ప‌ట్ల ఉన్న మ‌క్కువ అన‌న్య సామాన్య‌మ‌న్నారు. స‌భ చైర్మ‌న్‌గా స‌భ‌లో చ‌ర్చ‌లు మాతృభాష‌లోనూ జ‌రిగేందుకు ఆయ‌న స‌భ్యుల‌ను ప్రోత్సహించడం కడు ప్రశంసనీయమని  మోదీ అన్నారు.