రాజాసింగ్ రాజీనామా ఆమోదం

 

గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ రాజీనామాను బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఆమోదించారు. తెలంగాణ నూతన అధ్యక్ష పగ్గాలు రామ్‌చందర్‌రావు అప్పగించడాన్ని వ్యతిరేకిస్తూ రాజాసింగ్ బీజేపీకి రాజీనామ చేసిన సంగతి తెలిసిందే. ఈ నిర్ణయం తక్షణమే అమల్లోకి వస్తుందని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్‌సింగ్‌ ప్రకటన విడుదల చేశారు. కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డికి లేఖ అందజేశారు. పార్టీ రాష్ట్ర అధ్యక్ష పదవికి నామినేషన్‌ వేసేందుకు తనను అనుమతించలేదని, అందుకే రాజీనామా చేసినట్టు పేర్కొన్నారు.
 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu