కుర్చీ వేయలేదని అలిగిన కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి

 

కడప పోలీసు పరేడ్ మైదానంలో ఏర్పాటు చేసిన  స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో  ప్రొటోకాల్‌ ప్రకారం తనకు కుర్చీ వేయలేదని అలిగి వెళ్లిపోయారు. తనకు వేదిక సమీపంలో తనకు కేటాయించిన సీటులో అధికారులు కూర్చున్నారని ఆమె అలిగారు. అయితే, ముందు వరుసలో కుర్చీలన్నీ అధికారులతో నిండిపోయాయి. దీంతో ఎమ్మెల్యే మాధవి రెడ్డి కడప జాయింట్ కలెక్టర్ ఆదితి సింగ్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో అధికారులు ఎమ్మెల్యే కోసం మరో కుర్చీని ఏర్పాటు చేశారు. 

అయితే, జాతీయ పతాక ఆవిష్కరణ జరిగేంత వరకూ నిలుచునే ఉన్న ఎమ్మెల్యే.. ఆ తర్వాత అక్కడి నుంచి వెళ్లిపోయారు.ఎమ్మెల్యే మాధవి రెడ్డి అలగడంతో కలెక్టర్‌ కలుగజేసుకుని ఆమెను స్టేజిపైకి రావాలని ఆహ్వానించారు. కానీ అప్పటికే కోపంతో ఊగిపోయిన మాధవి రెడ్డి స్టేజిపైకి వెళ్లడానికి తిరస్కరించింది. దీంతో అక్కడకు వెళ్లి కూర్చోవాలని సూచించారు. అయినప్పటికీ ఆమె పట్టించుకోలేదు. జెండా ఆవిష్కరణ కార్యక్రమం జరిగేంత వరకు దాదాపు అరగంటపాటు అక్కడే నిల్చుండి కార్యక్రమాలను తిలకించారు. అనంతరం అక్కడి నుంచి వెళ్లిపోయారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్‌గా మారింది.
 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu