ముంబైలో భారీ వర్ష బీభత్సం..నిలిచిపోయిన మోనో రైలు

 

ముంబైలో కురుస్తున్న భారీ వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ రోజు ఎలివేటెడ్ ట్రాక్‌పై నడిచే మోనో రైలు నిలిచిపోయింది. విద్యుత్ సరఫరాలో అంతరాయం కారణంగా మైసూర్ కాలనీ భక్తి పార్క్ స్టేషన్ల మధ్య ట్రైన్ దాదాపు గంటకుపైగా ఆగిపోయింది. ఆ సమయంలో 100 మంది ప్రయాణికులు అందులోోో చిక్కున్నట్లు సమాచారం. ఈఘటనపై సమాచారం అందుకున్న అధికారులు అప్రమత్తమైన సహాయక చర్యలు చేపట్టారు. వరుసగా నాలుగో రోజూ భారీ వర్షాలు కురుస్తున్నాయి. గత 24 గంటల్లో నగరంలో 300 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. 

దీంతో రోడ్లన్నీ జలమయం కావడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.అనేక ప్రదేశాలలో రైల్వే ట్రాక్‌లు నీటిలో మునిగిపోయాయి. మరోవైపు విమాన ప్రయాణాలపైనా తీవ్ర ప్రభావం పడింది. ముంబై విమానాశ్రయం నుంచి బయలుదేరే 304 విమానాలు ఆలస్యంగా నడిచాయి. పది విమానాలు రద్దు కాగా, 198 విమానాలు షెడ్యూల్ కంటే ఆలస్యంగా నడుస్తున్నాయి. మరిన్ని భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో ముంబై, థానే, రాయ్‌గడ్, రత్నగిరి, సింధుదుర్గ్ జిల్లాలకు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu