ఒకే కుటుంబం: ముగ్గురు ప్రజా ప్రతినిథులు.. ఎమ్మెల్యే, జడ్పీటీసీ, ఎంపీపీ.!
Published on: Fri Nov 20, 2026 9:19AM

పోలవరం జిల్లా రాజకీయాలలో ఆసక్తికరమైన, అరుదైన పరిణామం చోటుచేసుకుంది. రంపచోడవరం నియోజకవర్గ తెలుగుదేశం ఎమ్మెల్యే మిరియాల శిరీషాదేవి కుటుంబానికి చెందిన ముగ్గురు వ్యక్తులు స్థానిక సంస్థలు, అసెంబ్లీ పదవుల్లో కొలువుదీరారు. తాజాగా ఎమ్మెల్యే తల్లి కృష్ణవేణి రాజవొమ్మంగి మండల ప్రజా పరిషత్ అధ్యక్షురాలిగా ఎన్నికవడంతో.. ఒకే కుటుంబానికి ఎమ్మెల్యే, జడ్పీటీసీ, ఎంపీపీ పదవులు దక్కినట్లైంది. ఈ పరిణామం స్థానిక రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. ఈ రాజకీయ సమీకరణాల్లో భాగంగా కృష్ణవేణి ఇటీవల జరిగిన ఎన్నికల్లో తంటికొండ ఎంపీటీసీ స్థానం నుంచి పోటీ చేసి విజయం సాధించారు. అనంతరం జరిగిన మండల పరిషత్ ఎన్నికల్లో సభ్యుల మద్దతుతో రాజవొమ్మంగి ఎంపీపీగా ఆమె బాధ్యతలు చేపట్టారు. మరోవైపు, ఎమ్మెల్యే శిరీషాదేవి భర్త విజయభాస్కర్ ఇప్పటికే జడ్పీటీసీ గెలుపొంది ప్రజాప్రతినిధిగా కొనసాగుతున్నారు.
ఇక ఈ కుటుంబంలో ప్రధాన రాజకీయ శక్తిగా ఎదిగిన మిరియాల శిరీషాదేవి ప్రస్థానం కూడా విశేషమైనది. గతంలో సాధారణ అంగన్వాడీ టీచర్‌గా పనిచేసిన ఆమె.. 2024లో ఎన్నికల్లో తెలుగుదేశం అభ్యర్థిగా రంపచోడవరం నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఘన విజయం సాధించి అసెంబ్లీలో అడుగుపెట్టారు. ఇప్పుడు తల్లి, భర్త కూడా స్థానిక సంస్థల ఎన్నికల్లో కీలక పదవులు దక్కించుకోవడం విశేషంగా మారింది. సాధారణంగా రాజకీయాల్లో ఒకే కుటుంబానికి చెందిన వారికి వరుసగా పదవులు దక్కడం అరుదుగా జరుగుతుంటుంది.
కానీ రంపచోడవరం నియోజకవర్గ పరిధిలో ఎమ్మెల్యేతో పాటు,ఎంపీపీ పదవి, జడ్పీటీసీ పదవులలో ఒకే కుటుంబ సభ్యులు ఉండటం విశేషం. ఈ పరిణామంపై స్థానిక టీడీపీ శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది. క్షేత్రస్థాయి నుంచి అసెంబ్లీ స్థాయి వరకు ప్రజాప్రతినిధులంతా ఒకే కుటుంబానికి చెందిన వారు కావడంతో, ప్రభుత్వ పథకాలు, అభివృద్ధి నిధుల మంజూరు విషయంలో సమన్వయం సులభమవుతుందని పార్టీ నాయకులు, కార్యకర్తలు అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా అంగన్వాడీ టీచర్ స్థాయి నుంచి ఎమ్మెల్యేగా ఎదిగిన శిరీషాదేవి కుటుంబానికి ప్రజల్లో ఉన్న ఆదరణకు ఈ విజయాలే నిదర్శనమని స్థానిక నేతలు పేర్కొంటున్నారు.

మరోవైపు, ఒకే కుటుంబానికి మూడు ప్రధాన పదవులు దక్కడంపై రాజకీయ పరిశీలకులు భిన్న కోణాల్లో విశ్లేషిస్తున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో సాధించిన ఈ వరుస విజయాలు రంపచోడవరం నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ బలాన్ని మరింత పెంచాయని అంటున్నారు. అదే సమయంలో మిరియాల శిరీషాదేవి కుటుంబానికి స్థానిక ప్రజలలో ఉన్న ఆదరణకు ఇది నిదర్శనంగా చెబుతున్నారు.
ఇది కూడా చదవండి: సర్పంచ్ బరిలో మంత్రి సతీమణి: బనగానపల్లె బరిలో బీసీ జనార్దన్ రెడ్డి భార్య ఇందిరారెడ్డి.!
రాబోయే రోజుల్లో ఎమ్మెల్యే శిరీషాదేవి, జడ్పీటీసీ విజయభాస్కర్, ఎంపీపీ కృష్ణవేణి సమష్టి కృషితో రంపచోడవరం, రాజవొమ్మంగి ప్రాంతాల అభివృద్ధి పరుగులు పెడుతుందన్న ఆశాభావం స్థానికులలో వ్యక్తం అవుతున్నది. మూడు కీలక పదవులు ఒకే కుటుంబంలో ఉన్న నేపథ్యంలో, మౌలిక సదుపాయాల కల్పన, స్థానిక సమస్యల పరిష్కారంపై ప్రజలు వీరి నుంచి మరిన్ని ఫలితాలను ఆశిస్తున్నారు.

ప్రజాప్రతినిధులుగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న ఈ ముగ్గురు నేతలు సమన్వయంతో వ్యవహరిస్తూ, నియోజకవర్గ ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటారని పార్టీ వర్గాలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి. ఈ అరుదైన ఫ్యామిలీ ప్యాకేజ్ విజయం పోలవరం జిల్లా రాజకీయాల్లో ఒక ప్రత్యేక ఘట్టంగా నిలిచిపోయింది.
మీకు నచ్చవచ్చు: మున్సిపల్ ఎన్నికల్లో కూటమి అఖండ విజయం సాధించింది: సీఎం చంద్రబాబు
ఏపీ పరిషత్ ఎన్నికలు: కూటమి టార్గెట్ 94 పర్సంట్ స్ట్రైక్ రేట్.. దిశానిర్దేశం చేసిన చంద్రబాబు.!
[MiriyalaSirisha Devi, Rampachodavaram MLA, MotherMPP, HusbandZPTC, Polavaram district politics, TeluguOne]


