TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

సర్పంచ్ బరిలో మంత్రి సతీమణి: బనగానపల్లె బరిలో బీసీ జనార్దన్ రెడ్డి భార్య ఇందిరారెడ్డి.!

Published on: Thu Nov 19, 2026 2:27PM

నంద్యాల జిల్లా బనగానపల్లె మేజర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ పదవి బరిలోకి మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి సతీమణి ఇందిరా రెడ్డి దిగారు. సర్పంచ్ పదవికి పోటీ చేసేందుకు ఆమె నామినేషన్ దాఖలు చేశారు. మంత్రి సతీమణి ప్రత్యక్ష ఎన్నికల బరిలోకి అందులోనూ పంచాయతీ ఎన్నికల బరిలోకి దిగడం చర్చనీయాంశంగా మారింది.  

బనగానపల్లెలోని ఎంపీడీవో కార్యాలయానికి చేరుకున్న ఇందిరా రెడ్డి, ఎన్నికల రిటర్నింగ్ అధికారికి తన నామినేషన్ పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా కూటమికి చెందిన పలువురు నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరై ఆమెకు మద్దతు పలికారు.  

నామినేషన్ పత్రాలు సమర్పించిన అనంతరం మీడియాతో మాట్లాడిన ఇందిరా రెడ్డి.. బనగానపల్లె మేజర్ పంచాయతీని అన్ని రంగాల్లో  అభివృద్ధి చేయడమే తన ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు. ఈ పంచాయతీని రాష్ట్రంలోనే ఒక ఆదర్శ పంచాయతీగా నిలబెట్టేందుకు కృషి చేస్తానన్నారు. 

ప్రజలకు  మౌలిక సదుపాయాల కల్పన, పారిశుద్ధ్య నిర్వహణ, తాగునీటి సరఫరా వంటి అంశాలతో పాటు అభివృద్ధి పనులను వేగవంతం చేయడంపై దృష్టి పెడతానని  పేర్కొన్న ఇందిరారెడ్డి.. ప్రజా మద్దతు తనకే ఉంటుందనీ, విజయం సాధిస్తాననీ ధీమా వ్యక్తం చేశారు.  

ఇది కూడా చదవండి: పురపోరు: తెలుగుదేశం కూటమి జోరు.!​

రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల ప్రక్రియ వేగంగా సాగుతున్న వేళ, కీలకమైన మేజర్ పంచాయతీలలో నామినేషన్ల ఘట్టం ఆసక్తిని రేకెత్తిస్తోంది. కూటమి నాయకుల సమన్వయం, క్షేత్రస్థాయి మద్దతుతో బనగానపల్లెలో ఎన్నికల ప్రచారం మరింత ఊపందుకునే అవకాశం కనిపిస్తోంది.

స్థానిక ప్రజల సమస్యల పరిష్కారం, పంచాయతీ పరిధిలో అభివృద్ధి పనుల అమలు వంటి అంశాలు ఈ ఎన్నికల్లో కీలక పాత్ర పోషించనున్నాయి.  మొత్తానికి బనగానపల్లె సర్పంచి పదవికి ఇందిరా రెడ్డి నామినేషన్ దాఖలు చేయడంతో నంద్యాల జిల్లా పంచాయతీ రాజకీయాలు మరింత రసవత్తరంగా మారాయి. ఆదర్శ పంచాయతీ లక్ష్యంగా ఆమె ముందుకు సాగుతుండటంతో ఎన్నికల పోరుపై స్థానికుల్లో ఆసక్తి నెలకొంది.

మీకు నచ్చవచ్చు:  అభ్యర్థుల ప్రకటనలో తెలుగుదేశం జోరు: స్థానిక సమరం.. క్యాండేట్ల రెండో జాబితా విడుదల.!

మూడో దశ పంచాయతీ ఎన్నికలకు నోటిఫికేషన్: డిసెంబర్ 2న పోలింగ్.!

[IndiraReddyNomination, BC Janardhan Reddy, Wife, BanaganapalleSarpanch, Candidate, TeluguOne]