గాల్లో గెలిచిన..గాలి నా కొడుకులు..రోజా సంచలన వ్యాఖ్యలు

 

వైసీపీ మాజీ మంత్రి ఆర్కే రోజా మరోసారి రెచ్చిపోయి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. గాలిలో గెలిచిన..గాలిన కొడుకులు ఎక్కువయ్యారంటూ కూటమి నేతలపై మండిపడ్డారు. వైసీపీ వస్తే టీడీపీ, జనసేన అమెరికా పారిపోవాలి. ఇప్పుడు సీఎం చంద్రబాబు, నారా లోకేశ్, పవన్ కళ్యాణ్ హైదారాబాద్ పారిపోతున్నారు. రేపు అమెరికా పోతారు. పవన్ కళ్యాణ్‌కు పిచ్చి బాగా ముదిరింది. ఎక్కడికి వెళ్లినా అక్కడే పుట్టానంటాడు అని రోజా ఆగ్రహం వ్యక్తం చేశారు. 

అధికారంలో ఉన్నామని టీడీపీ, జనసేన నేతలు ఇష్టం వచ్చినట్టు వైసీపీ శ్రేణులపై కేసులు పెట్టి దాడులు చేస్తే తాము వంద రెట్లు వడ్డీతో సహా చెల్లిస్తామని హెచ్చరించ్చారు. రోజా తన శాఖల ద్వారా చేసిన అభివృద్ధి శూన్యమని, సభ్యసమాజం తలదించుకునేలా నోరు పారేసుకోవడమే ఆమె పని టీడీపీ నేతలు అంటున్నారు. కాగా, వైసీపీ హయాంలో మాజీ మంత్రి రోజా కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని దోచుకున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. అమె త్వరలో అరెస్ట్ అవ్వడం ఖాయమని టీడీపీ కీలక నేతలు అంటున్నారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu