ధనవంతులకు సబ్సిడీ గ్యాస్ కట్?

 

ధనవంతులకు ఎల్‌పీజీ గ్యాస్ సబ్సిడీని తొలగించేందుకు ప్రభుత్వం ఆలోచిస్తోందని కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ వెల్లడించారు. ఈ నిర్ణయాన్ని కొందరు హర్షిస్తారు... కొందరు వ్యతిరేకిస్తారు. అయితే దేశ శ్రేయస్సు కోసం ఈ నిర్ణయాన్ని తీసుకోక తప్పని పరిస్థితులు ఉన్నాయని ఆయన అన్నారు. ధనవంతులకు ఎల్పీజీ సబ్సిడీ తొలగింపుపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు. ఉన్నత స్థాయిలో ఉన్న రాజకీయ నాయకుడు నిర్ణయం తీసుకోగలిగితే ఎలాంటి క్లిష్ట సమస్య అయినా అతి సులభంగా పరిష్కారమవుతుందని, ధనవంతులకు ఎల్పీజీ సబ్సిడీని తొలగించే నిర్ణయం కూడా అలాంటిదేనని అరుణ్ జైట్లీ అన్నారు. గత ప్రభుత్వాలు గ్యాస్, డీజిల్ తదితర సమస్యలపై సరైన రీతిలో దృష్టి సారించలేదని, తమ ప్రభుత్వం మాత్రం సరైన రీతిలో నిర్ణయాలు తీసుకుంటుందని అన్నారు.