31 నుంచి మొదలవనున్న గ్యాస్‌ కష్టాలు

 

హైదరాబాద్‌లో గ్యాస్‌ కష్టాలు మొదలవనున్నాయి. ఈ నెల 31 నుంచి నగదు బదిలీ పథకం అమలవుతుండటంతో ఫస్ట్‌ నుంచి అందరూ సిలిండర్‌ 990 రూపాయలు పెట్టి తీసుకోవాల్సిందే. ఆదార్‌ నెంబర్‌ను గ్యాస్‌ ఏజెన్సీలతో పాటు, బ్యాంక్‌ ఎకౌంట్లకు కూడా లింక్‌ చేయించుకున్నవారికి మాత్రమే సబ్సిడి సొమ్ము అందలేదు. ఇప్పటి వరకు ఈ ప్రక్రియ కింద ఎల్పీజీ కనెక్షన్లు ఆధార్, బ్యాంక్ ఖాతాలతో అనుసంధానమైంది 34 శాతమే.. అయితే ఫస్ట్‌ లోపు ఆధార్ పొందని గ్యాస్ వినియోగదారులు.. గ్యాస్ సిలిండర్‌ను మార్కెట్ ధరకే కొనుక్కోవాల్సి ఉంటుంది.  

గడువు ఇంకా మూడు రోజులు మాత్రమే ఉండటంతో బ్యాంక్‌లు ఆదివారం కూడా నమోదు ప్రక్రియకు వీలు కల్సించనున్నాయి. దీనితో పాటు వినియోగదారులకు జిరో బ్యాలెన్స్‌ ఎకౌంట్లు తీసుకునే వీలును కూడా కల్పిస్తున్నాయి. అయితే ఎన్ని చర్యలు చేపట్టిన గడువులోగా అందరి ఆదార్‌ నెంబర్లు నమోదు చేయడం సాధ్యపడదంటున్నారు విశ్లేషకులు.

అక్టోబర్‌ 1 నుంచి నెల్లూరు జిల్లాలో కూడా నగదు బదిలీ పథకం అమలు అవుతుండటంతో సామాన్యుడికి గ్యాస్‌ కష్టాలు తప్పేలాలేవు. ఇప్పటికే ఐదు జిల్లాల్లో నగదు బదిలీ పథకం అమలవుతున్నా సమస్యలు కూడా అదే స్ధాయిలో తలెత్తుతున్నాయి. అయితే ఆదార్‌ కార్డు ఉన్న వారికి నగదు బదిలీ అందుతుండటంతో చాలా మందికి సబ్సిడి సొమ్ము అందే అవకాశం లేదంటున్నాయి గణాంకాలు.

జిల్లాలొ దాదాపు 30 లక్షల  జనాభా ఉండగా ఇంకా కేవలం 20 లక్షల మందికి మాత్రమే ఆదార్‌ కార్డులు అందాయి. జిల్లాలో ఐదెన్నర లోలక్షల గ్యాస్‌ కనెక్షన్‌లు ఉండగా వీరిలో కేవలం 2 లక్షల మంది మాత్రమే గ్యాస్‌ ఏజెన్సీలలో తన ఆదార్‌ నెంబర్‌ను లింక్‌ చేయించారు. దీంతో నగదు బదిలీ పథకం అమలయితే 50 శాతానికి పైగా ప్రజలు గ్యాస్‌ సిలిండర్‌కు 990 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది.