లాలూ గుండెకి మూడు రంధ్రాలు

 

రాష్ట్రీయ జనతాదళ్ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ గుండెకు సంబంధించిన వ్యాధితో ముంబైలోని ఏషియన్ హార్ట్ ఇన్‌స్టిట్యూట్ ఆస్పత్రిలో చేరిన విషయం తెలిసిందే. లాలూ ప్రసాద్ గుండె పనితీరును గమనించిన వైద్యులు ఆయనకు తప్పనిసరిగా ఆపరేషన్ చేయాలని నిర్ధారించారు. బుధవారం నాడు ఆయనకు ఆరుగంటల సేపు గుండె ఆపరేషన్ చేశారు. ఆపరేషన్ విజయవంతంగా పూర్తయింది. లాలూ ప్రసాద్ యాదవ్ గుండెకు మూడు మిల్లీ మీటర్ల వ్యాసార్థం వున్న మూడు రంధ్రాలు పడ్డాయని, ఆపరేషన్‌ ద్వారా ఆ రంధ్రాలను పూడ్చామని వైద్యులు తెలిపారు. ఏషియన్ హార్ట్ ఇన్‌స్టిట్యూట్ హెడ్ డాక్టర్ రమాకాంత పాండా ఆధ్వర్యంలో లాలూ ప్రసాద్ యాదవ్‌కి ఆపరేషన్ జరిగింది. ఐదు సంవత్సరాల క్రితం అప్పటి భారత ప్రధాని మన్మోహన్‌సింగ్ గుండెకు కూడా రమాకాంత పాండానే ఆపరేషన్ చేశారు.