ఈత సరదాకు ఆరుగురు చిన్నారులు బలి

 

సరదాగా ఈతకు వెళ్లిన విద్యార్థులు మృత్యువు వడిలోకి చేరారు. కర్నూలు జిల్లా ఆస్పరి మండలం చిగిలి గ్రామంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఈతకు వెళ్లి 6 గురు విద్యార్థులు తిరిగిరాని లోకానికి వెళ్లిపోయారు. స్కూల్ వదిలిన తరువాత సరదాగా ఈతకు వెళ్దామని ఐదవ తరగతి చదువుతున్న ఏడుగురు విద్యార్థులు ఊరికి దగ్గరలో ఉన్ననీటికుంటలో ఈతకువెళ్ళారు. వెళ్లిన ఏడుగురు విద్యార్థులుఆరుగురు విద్యార్థులు ఈతకు వెళ్లగా ఒక విద్యార్థి ఒడ్డున నిలబడ్డాడు. 

నీటికుంటలో ఆరుగురు విద్యార్థులు మునిగి పోవడంతో ఒడ్డున ఉన్న విద్యార్థి గ్రామంలోకి వెళ్లి ఊరి పెద్దలకు విషయం తెలిపాడు. గ్రామ పెద్దలంతా హుటాహుటిన కుంట దగ్గరకు వెళ్లారు. వారంతా వచ్చేలోపు జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఆరుగురు విద్యార్థులు మృతి చెందినట్లు గుర్తించారు. నీటికుంటలో నుండి ఒక్కొక్కరి మృతదేహం బయట పడుతుంటే 

పిల్లల తల్లిదండ్రుల ఆర్తనాదాలు అందరి కంట కన్నీరు తెప్పించాయి. స్కూల్ నుండి ఇంటికి రావాల్సిన పిల్లలు విగత జీవులుగా మారడంతో అయ్యో దేవుడా అంటూ కన్నీరు మున్నీరయ్యారు. విద్యార్థుల మృత దేహాలను పోస్టు మార్టం నిమిత్తం ఆదోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతి చెందిన విద్యార్థుల తల్లిదండ్రులకు రాష్ట్ర మంత్రులు టీజీ భరత్, బీసీ జనార్ధన్ రెడ్డి, కర్నూలు ఎంపీ నాగరాజు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. స్థానిక ఆలూరు ఎమ్మెల్యే వీరుపాక్షి మృతదేహాలకు నివాళి అర్పించి తల్లిదండ్రులను ఓదార్చారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu