వరుస మీటింగ్ లతో బిజీ బిజీగా ఉన్న మంత్రి కేటీఆర్...

తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఫలితలు విడుదలైన దెగ్గర నుంచి తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్ వరుస ప్రెస్ మీట్ లు, మీటింగ్ లతో హడావిడిగా ఉన్నారు.వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి కేటీఆర్ ఇవాళ వరుస మీటింగులతో బిజీ బిజీగా గడపనున్నారు. ఈ సాయంత్రం ఎంపీలతో కీలక సమావేశాన్ని నిర్వహించబోతున్నారు. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో పార్టీ పరంగా అనుసరించాల్సిన వ్యూహాలను ఎంపీలతో చర్చించనున్నట్లు సమాచారం.విభజన అంశాలను పార్లమెంట్ లో చర్చించి రాష్ట్రానికి రావాల్సిన నిధుల పై కేంద్రానికి ఒత్తిడి తేవాలని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎంపీలకు దిశా నిర్దేశం చేయనున్నారు కేటీఆర్. 

కాసేపట్లో మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్, మేయర్లతో సమావేశం కూడా నిర్వహించనున్నారు. రోజుకు మూడు ఉమ్మడి జిల్లాల చొప్పున భేటీ అయ్యి నగరాభివృద్ధికి సంబంధించి చర్చించనున్నారు కెటిఆర్. కొద్ది సేపట్లోనే ఈ సమావేశలు ప్రారంభం కాబోతున్నట్లు సమాచారం. రోజుకు మూడు ఉమ్మడి జిల్లాల చొప్పున మేయర్ ల తో,చైర్ పర్సన్ ల తో కేటీఆర్ సమావేశంలో పాల్గొనటమేకాక, వాళ్ళకు గ్రామ అభివృద్ధికి తగిన సూచనలు,వారి స్థానాలల్లో అనుసరించాల్సిన వ్యూహాలు తీసుకోవలసిన జాగ్రత్తలు అభివృద్ధి కోసం తీసుకోవాల్సిన చర్యల గురించి కొంత మేరా సూచనలు ఇవ్వనున్నట్లు సమాచారం. మేజర్ గా నియమితులైయ్యే వారికి వాటికి సంబంధించి గైడెన్స్ ఇస్తూ గ్రామ అభివృద్ధిని పై దృష్టి సారించనున్నారు కేటీఆర్. .