కాంగ్రెస్‌కు అంత సీన్ లేదు

 

తెరాస ముందస్తు ఎన్నికలకు సిద్ధమని సవాల్ విసిరింది.. మరోవైపు ముందస్తుగానే ప్రతిపక్ష కాంగ్రెస్ మీద విమర్శలు మొదలు పెట్టింది.. మొన్నటికి మొన్న సీఎం కేసీఆర్ కాంగ్రెస్ మీద విమర్శలు చేసారు.. ఇప్పుడు ఆయన తనయుడు కమ్ మినిస్టర్ కేటీఆర్ వంతు వచ్చింది.. కొందరు టీడీపీ నేతలు కేటీఆర్, కవిత సమక్షంలో తెరాసలో చేరారు.. ఈ సందర్బంగా మాట్లాడిన కేటీఆర్ కాంగ్రెస్ మీద విరుచుకుపడ్డారు.. ముందస్తు ఎన్నికలకు కాంగ్రెస్ కూడా సిద్ధం అంటుంది కానీ వారికంత సీన్ లేదన్న కేటీఆర్, వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తెరాస 100కు పైగా సీట్లు గెలుస్తుందని స్పష్టం చేశారు.. సీఎం కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రంలో బ్రహ్మాండంగా పాలన కొనసాగుతోందన్నారు.

 కమీషన్లు, కాంట్రాక్టులు, సంచులు మోయడం కాంగ్రెస్ కు అలవాటని.. కాంగ్రెస్ చరిత్ర కుంభకోణాల మయమని విమర్శించిన కేటీఆర్, కాంగ్రెస్ లాంటి గలీజ్ పార్టీ దేశంలో మరొకటి ఉండదని మండిపడ్డారు.. అవినీతి గురించి కాంగ్రెస్ మాట్లాడటం దెయ్యాలు వేదాలు వల్లించినట్టుందని అన్నారు.. కాంగ్రెస్ కు 10 మంది ఎమ్మెల్యేలుంటే ఎవరికి వారు మేమే సీఎం అభ్యర్థి అనుకుంటున్నారని, అది సీఎం అభ్యర్థుల పార్టీ అని కేటీఆర్ విమర్శించారు.