మేడిగడ్డ బ్యారేజిపై కెటీఆర్ తీరు ఉల్టా చోర్ కొత్వాల్ కో డాంటే

పదేళ్ల కెసీఆర్ ప్రభుత్వం కుప్పకూలడానికి కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ బ్యారేజి అని చిన్న పిల్లాడైనా ఠక్కున చెప్పేస్తాడు.  కాళేశ్వరం ప్రాజెక్టు కల్దకుంట్ల ఫ్యామిలీకి ఎటిఎం మాదిరిగా మారిందని గత అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ చెప్పింది. ప్రజలు నమ్మారు. 10 ఏళ్ల విరామం తర్వాత ఆ పార్టీకి పట్టం కట్టారు. కానీ కల్వకుంట్ల వారసుడైన కెటీఆర్ మాత్రం ఇందులో  తమ తప్పేమి లేదన్నట్టుగా మాట్లాడటం విడ్డూరంగా ఉంది. దొంగనే పోలీసు అధికారిని దొంగ దొంగా అన్నట్టు ఉంది. దీన్నే ఉర్దూలో ఉల్టా చోర్ కొత్వాల్ కో డాంటే అంటారు. 
అహో ధార్ష్ట్య మసాధూనాం
నిందతా మనఘా స్త్రియః
మృష్ణతా మివ చోరాణాం
తిష్ఠ చోరేతి జల్పతాం

పవిత్రలూ, శీలవతులూ అయిన స్త్రీలను నిందించే దుర్మార్గులైన పురుషులను ఏమనవచ్చు దొంగతనం చేసిన వాడే దొంగా దొంగా అన్నట్టుగా ఉంది కెటీఆర్ మాటల తీరు.

తెలంగాణలో కరువు పరిస్థితులు ఉన్నాయని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. అయితే, ఇది కాలం తెచ్చిన కరువు కాది, కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిన కరువు అని చెప్పారు. గత ఏడాది ఇదే కాలంలో రైతులకు పుష్కలంగా సాగు నీటిని అందించామని తెలిపారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత కేసీఆర్ మీద కోపంతో మేడిగడ్డ ప్రాజెక్టును రిపేర్ చేయకుండా రైతులను ఇబ్బంది పెడుతున్నారని మండిపడ్డారు. ఢిల్లీకి, హైదరాబాద్ కి మధ్య తిరగడం తప్ప.. రైతులను పరామర్శించేందుకు సీఎం రేవంత్ కు సమయం లేదని అన్నారు. 

ఇప్పటి వరకు సుమారు 200 మంది రైతులు చనిపోయారని కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. రైతులను ఆదుకోవాలని... ఎండిపోయిన పంటకు నష్ట పరిహారం అందించాలని చెప్పారు. ఎకరానికి రూ. 10 వేలు ఇస్తారో, రూ. 25 వేలు ఇస్తారో ఇవ్వండని అన్నారు. రైతులకు ఇస్తామన్న బోనస్, కౌలు రైతులకు ఇస్తామన్న రైతు బంధు ఇవ్వాలని డిమాండ్ చేశారు. 

రైతుబంధు కోసం కేసీఆర్ రూ. 7 వేల కోట్లు పెట్టిపోతే... ఆ డబ్బులు రైతులకు ఇవ్వకుండా... కాంట్రాక్టర్లకు ఇస్తున్నారని కేటీఆర్ విమర్శించారు. రైతుల దీన పరిస్థితి చూస్తే గుండె తరుక్కుపోతోందని చెప్పారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఈరోజు కేటీఆర్ పర్యటించారు. తంగళ్లపల్లి మండలం సారంపల్లి వద్ద పంట నష్టాన్ని ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పైవ్యాఖ్యలు చేశారు.