కోదండరాం అరెస్ట్.. ఉద్రిక్త వాతావరణం

 

తెలంగాణ ప్రభుత్వం నిర్మిస్తున్న మల్లన్న సాగర్ ప్రాజెక్టుకు ప్రజల నుండి వ్యతిరేకత వస్తున్న సంగతి తెలిసిందే. కానీ తెలంగాణ ప్రభుత్వం మాత్రం  ఎలాగైనా ప్రాజెక్టును నిర్మించి తీరుతాం అని తేల్చిచెబుతుంది. దీనిలోభాగంగానే నిన్న ప్రాజెక్టుకు వ్యతిరేకంగా ప్రజలు ఆందోళనలకు దిగారు. దీంతో పోలీసులు వారిపై లాఠీ ఛార్జీ చేశారు. ఇప్పుడు తాజాగా మల్లన్నసాగర్ ప్రాజెక్టు వ్యతిరేకంగా పోరాడుతున్న జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాంను పోలీసులు అరెస్ట్ చేశారు. ముంపు గ్రామాల పర్యటనకు బయలుదేరిన కోదండరాంను పోలీసులు ఒంటిమామిడి వద్ద అడ్డుకున్నారు. ఈ నేపథ్యంలో పోలీసులకి, జేఏసీ నేతలిక మధ్య వాగ్వాదం చోటుచేసుకోగా అక్కడ తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. జేఏసీ నేతలు పోలీసులను అదుపు చేయగలిగినా పోలీసులు మాత్రం కోదండరాంను అరెస్ట్ చేశారు.

 


మరోవైపు కోదండరాం అరెస్ట్ కు నిరసనగా ధర్నా చేపట్టారు. కోదండరాం ను విడుదల చేయాలని కాంగ్రెస్, సీపీఐ, సీపీఎం పార్టీలు నిరసన వ్యక్తం చేస్తున్నాయి.