పెంచుకుంటానని కుక్కల్ని తెచ్చుకుని ఆమె ఏం చేసిందో తెలుసా?

పైకి జంతుప్రేమికురాలిగా నటిస్తూ.. కుక్కలను చంపి తింటున్న మహిళ ఉదంతం చైనాలో వెలుగు చూసింది. గతంలో చైనాలో కుక్క మాంసంపై ఎలాంటి ఆంక్షలు లేకపోయినా.. కరోనా అనంతరం నిబంధనలు కఠినతరం చేసారు. కుక్కమాంసం తినడం పై నిషేధం విధించారు. చైనా లోని లియోనింగ్ ప్రావిన్స్ కు చెందిన ఒకమహిళ కుక్కల సంరక్షణా కేంద్రాలకు వెళ్లి మంచి మంచి కుక్కలను ఎంపిక చేసుకుని దత్తత పేరు చెప్పి ఇంటికి తీసుకు వెళ్లేది. అక్కడ వాటిని చంపి వండుకుని తినేసేది.  చాలా కాలం పాటు ఈ తంతు నిరాఘాటంగా సాగింది. అయితే తాాగా ఆమె సోషల్ మీడియాలో పెట్టిన ఓ పోస్టు కారణంగా ఆమె నిర్వాకం వెలుగులోకి వచ్చింది.

ఇంతకీ ఆమె సామాజిక మాధ్యమంలో పెట్టిన పోస్టు ఏమిటంటే..  కుక్క మాంసం రెడీ, బయట వర్షం పడుతోంది. వేడివేడి కుక్క మాంసం తింటుంటే భలే రుచిగా ఉంటుంది అని.అంతే కాకుండా  పిల్లలకు మంచి ఆహారం కుక్క మాంసం అని కూడా ఆ పోస్టులో పేర్కొంది. అలాగే ఆ పోస్టుకు కొన్ని వీడియోలనూ జత చేసింది.  దీంతో ఆమె బండారం బయటపడింది.  నెటిజన్లు  ఆమెపై కఠినచర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసారు.  పోలీసులురంగంలో దిగి ఆమె ఇంట్లో సోదాలు చేసి కుక్క మాంసం గుర్తించి అరెస్ట్ చేసారు. ఇప్పుడు ఆమె జిహ్వ చాపల్యానికి  ఎన్ని కుక్కలు బలయ్యాయా అని  లెక్కలు తీస్తున్నారు. 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu