ఆరు నెలల తర్వాత తెరుచుకున్న కేదార్నాథ్ ఆలయ తలుపులు

ఉత్తరాఖండ్ లోని కేదార్నాథ్ దేవాలయం ద్వారాలు తెరుచుకున్నాయి శుక్రవారం (మే 2) ఉదయం 7 గంటలకు మంత్రోచ్ఛారణల మధ్య కేదారనాథ్ దేవాలయ ద్వారాలను తెరిచారు. ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ దామీ కేదారనాథుని దర్శనం చేసుకుని తొలి పూజ చేశారు.  జ్యోతిర్లింగాలలో ఒకటైన కేదారనాథుడిని దర్శించు కునేందుకు దేశం నలుమూ లల నుంచి ఏటా లక్షలాది మంది దర్శించుకుంటుంటా రు. భారీ మంచు కార‌ణంగా సుదీర్ఘ‌కాలం మూసి ఉండే ఈ పుణ్య‌క్షేత్రం దాదాపు ఆరు నెలల తరువాత ఈ రోజు తెరుచుకుంది.

ఈ సందర్భంగా ఆలయాన్ని పువ్వులతో అందంగా అలంకరించారు.  కేదారనాథుని దర్శించుకునేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు పోటెత్తారు. హెలికాప్టర్ ద్వారా భక్తులపై పూలర్షం కురిపించారు.  ఆరు  నెలల కిందట ఆలయం తలుపులను మూసివేసే సమయంలో మూల మూర్తికి అలంకరించిన పూజావస్తువులను తొలగించారు. తాజా పూలతో స్వామివారిని అలంకరించారు. కేదార్‌నాథ్ ఆలయం తలుపులు తెరచు కోవడంతో చార్ ధామ్ యాత్ర సీజన్ ప్రారంభమై నట్లయ్యింది.  యమునోత్రి, గంగోత్రి, కేదార్‌నాథ్, బద్రీనాథ్ ఆలయాలను చార్ ధామ్ క్షేత్రాలుగా పిలుస్తారు. 

యమునోత్రి, గంగోత్రి ధామాలు ఏప్రిల్ 30న‌ అక్ష‌య తృతీయ రోజున తెర‌వ‌గా, బద్రీనాథ్ ఆల‌యాన్ని ఈ నెల 4న తెర‌వ‌నున్నారు. కాగా కేదార్‌నాథ్ యాత్ర కోసం సోన్‌ప్ర‌యాగ్ నుంచి హెలి కాప్ట‌ర్ సేవ‌లు ప్రారంభ‌మ‌ య్యాయి. ఇటీవ‌ల జ‌మ్మూ క‌శ్మీర్‌లోని ప‌హ‌ల్గామ్‌లో ఉగ్ర‌దాడి నేప‌థ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్ర‌భుత్వాలు అప్ర‌మ‌ త్త‌మ‌య్యాయి. 

ఈ చార్‌ధామ్ యాత్ర కొన‌సాగే మార్గంలో పోలీ సులు, భ‌ద్ర‌తా బ‌ల‌గాల‌తో భారీ బందోబ‌స్తు ఏర్పాటు చేశారు. అనుమానిత వ్య‌క్తులు క‌నిపిస్తే వెంట‌నే పోలీసుల‌కు స‌మాచారం ఇవ్వాల‌ని భ‌క్తుల‌కు అధికారులు చెబుతున్నారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu