కెసిఆర్ ఢిల్లీ టూర్‌

 

తెలంగాణ రాష్ట్రస‌మితీ అధ్యక్షుడు చంద్రశేఖ‌ర్ రావు ఢిల్లీకి వెళ్లారు. ప్రస్థుతం జ‌రుగుతున్న పార్లమెంట్ స‌మావేశాల్లో పాల్గొనేందుకు ఆయ‌న డిల్లీ బ‌య‌లుదేరి వెళ్లారు. మూడురోజుల పాటు డిల్లీలోనే ఉండ‌నున్న ఆయ‌న పార్లమెంట్ స‌మావేశాల్లో పాల్గొన‌టంతో పాటు పలువురు రాజకీయ ప్రముఖుల‌తోనూ భేటి కానున్నారు.

తెలంగాణ రాష్ట్ర విభజనపై కాంగ్రెస్ పార్టీ ప్రకటన చేసిన తర్వాత కేసీఆర్ ఢిల్లీకి వెళ్లడం ఇదే తొలిసారి. దీనితో పాటు తెలంగాణ అంశం పై సోనియా గాంధి ఖ‌చ్చిత‌మైన ప్రక‌ట‌న చేసిన వెంట‌నే కెసిఆర్ ఢిల్లీ బ‌య‌లుదేర‌టం చ‌ర్చనీయాంశం అయింది. దీంతో ఈ పర్యటనలో కేసీఆర్ కాంగ్రెస్ అధిష్టానంలోని ముఖ్య నేతలను కలిసే అవకాశమున్నట్టు వార్తలు వెలువడుతున్నాయి.

ప్రస్థుతం ఉన్న ప‌రిస్థితుల్లో టిఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్‌లో విలీనం చేయ‌డం గురించి కాంగ్రెస్ నేత‌లతో కెసిఆర్ చ‌ర్చించే అవ‌కాశం ఉందంటున్నారు. దీనితో పాటు ఆంటోని క‌మిటీతో కూడా కెసిఆర్ స‌మావేశం అయ్యే అవ‌కాశం ఉందంటున్నారు విశ్లేష‌కులు.