హైకోర్టులో యడ్యూరప్పకు ఊరట.. పోక్సో కేసులో ట్రయల్ కోర్టు విచారణకు హాజరు నుంచి మినహాయింపు
posted on Mar 15, 2025 9:15AM
.webp)
కర్నాటక మాజీ ముఖ్యమంత్రి యడ్యూరప్పకు భారీ ఊరట లభించింది. ఆయనపై నమోదైన పోక్సో కేసులో ట్రయల్ కోర్టు జారీ చేసిన సమన్లను కర్నాటక హైకోర్టు నిలిపివేసింది. దీంతో ఈ కేసులో యడ్యూరప్ప వ్యక్తిగతంలో ట్రయల్ కోర్టు ఎదుట హాజరు కావాల్సిన అవసరం లేకుండా పోయింది.
గత ఏడాది మార్చిలో యడ్యూరప్పపై నమోదైన పోక్సో కేసులో ట్రయల్ కోర్టు ఆయనతో సహా మరో ముగ్గురికి సమన్లు జారీ చేసింది. ఆ సమన్ల మేరకు వీరు శుక్రవారం (మార్చి 15) ట్రయల్ కోర్టు ఎదుట హాజరు కావాల్సి ఉంది. అయితే ట్రయల్ కోర్టు సమన్లను సవాల్ చేస్తూ యడ్యూరప్ప హైకోర్టును ఆశ్రయించారు.
ఈ నేపథ్యంలోనే హైకోర్టు ట్రయల్ కోర్టు సమన్లపై స్టే ఇస్తూ మధ్యంతర ఆదేశాలు జారీ చేసింది. ఈ సందర్భంగా ఈ వ్యవహారాన్ని సమగ్రంగా పరిశీలించాల్సి ఉందని న్యాయమూర్తి అభిప్రాయపడ్డారు. తన 17 ఏ్ల కుమార్తెపై యడ్యూరప్ప లైంగిక దాడికి పాల్పడ్డారంటూ బాధితురాలి తల్లి ఫిర్యాదు మేరకు యడ్యూరప్పపై పోక్సో కేసు నమోదైన సంగతి విదితమే.