కమలనాథన్ కమిటీ సూచనలు... వివరంగా..!!

 

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ఉద్యోగుల విభజన కోసం ఏర్పాటు చేసిన కమలనాథన్ కమిటీ తన మార్గదర్శకాలను నిర్ణయించింది. ఈ మార్గదర్శకాలు 19 పేజీలు వున్నాయి. వాటిని వెబ్‌సైట్‌లో వుంచారు. ఆ వివరాలు....

 

1. ఏడేళ్ళ విద్యార్హత ఆధారంగానే స్థానికతను నిర్ణయించాలి.

 

2. ఉద్యోగులలో దంపతులు, ఒంటరి మహిళలకు ఆప్షన్లు వుంటాయి.

 

3. రిటైరయ్యే ఉద్యోగులకు ఆప్షన్లు లేవు.

 

4. ఆర్టికల్ 371 డి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో కొనసాగుతుంది.

 

5. గ్రూప్-4 ఉద్యోగులను పూర్తిగా స్థానికత ఆధారంగానే విభజించాలి.

 

6. ఎస్సీ, ఎస్టీ ఉద్యోగులకు ఆప్షన్లు ఇవ్వాలి,.

 

7. నాలుగో తరగతి ఉద్యోగులకు ఆప్షన్లు లేవు.

 

8. వికలాంగులకు, తీవ్రమైన వ్యాధులతో బాధపడేవారికి ఆప్షన్లు వుంటాయి.

 

9. ఒక్కసారి ఆప్షన్ ఇస్తే మళ్ళీ మార్చడానికి కుదరదు.

 

10. కమిటీ సూచించిన విధి విధానాల మీద ఏవైనా అభ్యంతరాలు, సలహాలు వుంటే ఆగస్టు 5వ తేదీ లోపు తెలియజేయాలి.

 

11. అభ్యంతరాలు, సలహాలను పరిగణనలోకి తీసుకుని కేంద్ర ప్రభుత్వం తుది మార్గదర్శకాలను ఖరారు చేస్తుంది.

 

12. 1975 ఆర్డర్ సర్వీసు రికార్డ్ ఆధారంగా స్థానికతను గుర్తిస్తాం.

 

13. తప్పుడు స్థానికత ధ్రువీకరణ ఇస్తే కఠినచర్యలు ఉంటాయి.