ఆ వివాదంలో నన్ను లాగద్దు.. మంత్రి తుమ్మల సంచలన వ్యాఖ్యలు

 

కాళేశ్వరం ప్రాజెక్టు వివాదంలో తనను కావాలని లాగుతున్నరని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. కాళేశ్వరం కమీషన్ ఎదుట బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ అన్ని అబద్దాలు చెప్పారని తుమ్మల తెలిపారు.  ఈ వివాదంలో తనను లాగుతున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈటల ఇచ్చిన సమాధానాలు వాస్తవదూరంగా ఉన్నాయన్నారు. 

ఈటల సబ్ కమిటీ అంశాన్ని ప్రస్తావించారని ఈ సబ్ కమిటీ కాళేశ్వరం నిర్మాణం కోసం వేసింది కాదన్నారు. మేడిగడ్డ బ్యారేజీకి అనుమతులు ఇచ్చాక 15 రోజులకు ఈ రాష్ట్రంలో ఉన్న ఆన్ గోయింగ్ ప్రాజెక్టులపై ఈ సబ్ కమిటీని ఏర్పాటు చేసినట్లు చెప్పారు. పెండిగ్ ప్రాజెక్టులు ఎస్టిమేషన్ రేట్లకే కాంట్రాక్టర్లు పనులు పూర్తి చేస్తారా? పనులు చేస్తే ఏం చేయాలి? చేయకుంటే ప్రభుత్వం ఏం నిర్ణయం తీసుకోవాలని అనే అంశంపై సబ్ కమిటీ వేశారని చెప్పారు. సబ్ కమిటీ  నిర్ణయాలన్నీ తానే కమిషన్ ముందుకు సుమోటోగా తీసుకెళ్తానని పేర్కొన్నారు.
 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu