కాళేశ్వరం విచారణపై కేసీఆర్ కీలక నిర్ణయం

 

 

కాళేశ్వరం విచారణపై బీఆర్‌ఎస్ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి జూన్ 5న కేసీఆర్ కమిషన్ ఎదుట విచారణకు హాజరుకావాల్సి ఉండగా.. కీలక పరిణామం చోటుచేసుకుంది. తాను జూన్ 5న విచారణకు హాజరు కాలేనని.. జూన్ 11న తప్పక హాజరవుతానంటూ తాజాగా గులాబీ బాస్, కమిషన్‌కు సమాచారం అందజేశారు. ఆయన అభ్యర్థనను పరిగణలోకి తీసుకుని అంగీకరించిన కాళేశ్వరం కమిషన్ విచారణ తేదీని ఈ నెల 11కు వాయిదా వేసింది. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణాలో అవినీతిని బయట పెట్టేందుకు రేవంత్ సర్కార్ పీసీ చంద్రఘోష్ ఆధ్వర్యంలో కాళేశ్వరం కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. కాళేశ్వరం కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో నీటిపారుదల శాఖ మంత్రి  హరీష్ రావు , ఆర్థిక శాఖ మంత్రిగా విధులు నిర్వర్తించిన ఈటల రాజేందర్‌లను విచారణకు హాజరు కావాలంటూ కమిషన్ ఇటీవలే వారికి నోటీసులు జారీ చేసింది.