ఐపీఎల్ వేలంలో అందాల భామ‌.. ఆమె ఎవరో తెలుసా?

ఐపీఎల్ వేలం పోటాపోటీగా న‌డుస్తోంది. స్టార్ ప్లేయ‌ర్ల కోసం ఫ్రాంచ‌జీలు సీరియ‌స్‌గా ట్రై చేస్తున్నాయి. అందులో కోల్‌క‌తా నైట్‌రైడ‌ర్స్ మేనేజ్‌మెంట్ త‌ర‌ఫున ఓ అమ్మాయి చాలా స్మార్ట్‌గా యాక్ష‌న్‌లో పార్టిసిపేట్ చేస్తున్నారు. ప‌నితీరులానే.. ఆమె కూడా స్మార్ట్‌గా ఉన్నారు. యావ‌రేజ్ క‌ల‌రే అయినా.. ఆ లైటింగ్‌లో తెగ మెరిసిపోతున్నారు. ఎవ‌రా బ్యూటీ గర్ల్ అంటూ టీవీల్లో ఆమెను చూసిన వారంతా ముచ్చ‌ట‌ప‌డ్డారు. కొంద‌రు గుర్తుప‌ట్టారు కూడా. ఆమే.. జాహ్న‌వి చావ్లా. కోల్‌క‌తా టీం స‌హా య‌జ‌మాని జూహీ చావ్లా కూతురు. 

కోల్‌క‌తా త‌ర‌ఫున షారుఖ్ కుమారుడు ఆర్య‌న్‌ఖాన్‌, కుమార్తె సుహానాల‌తో క‌లిసి వేలంలో పాల్గొన్నారు జూహీ చావ్లా త‌న‌యురాలు జాహ్న‌వి చావ్లా. వారిద్ద‌రికంటే కాస్త క‌ల‌ర్ త‌క్కువే అయినా.. చామ‌న‌చాయ రంగులో ఈమే అందంగా క‌నిపించింది. ఆ క‌ళ్ల‌లో ఏదో మేజిక్ ఉన్న‌ట్టుంది.

రెండేళ్ల క్రితం జ‌రిగిన ఐపీఎల్ వేలంలోనూ ఆమె పార్టిసిపేట్ చేసింది. ఇది సెంక‌డ్ టైమ్‌. తల్లి జూహ్లీ చావ్లా తోడు లేకుండానే.. కోల్‌కతా నైట్ రైడర్స్ వేలంలో యాక్టివ్‌గా వ్య‌వ‌హ‌రించింది. ఆమె ఛార్మింగ్‌తో కెమెరాలన్నీ అటువైపే ఫోక‌స్ చేశాయి. జాహ్నవి విదేశాల్లో డిగ్రీ పూర్తి చేసివ‌చ్చి.. ప్ర‌స్తుతం కేకేఆర్ వ్య‌వ‌హారాలు చూస్తోంది. 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu