TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

ఒకే ఫ్రేమ్ లో జగన్, విజయ్, కేటీఆర్: ఈ సారి వైసీపీయుల ఎలివేషన్స్ ఎలా ఉంటాయో.?

Published on: Fri Nov 6, 2026 10:28AM

మూడు దక్షిణాది రాష్ట్రాలకు చెందిన ముగ్గురు ప్రముఖ నేతలు ఒకే వేదికపై కనిపించారు. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత జగన్, తెలంగాణ మాజీ మంత్రి, బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, తమిళనాడు ముఖ్యమంత్రి, టీవీకే అధినేత విజయ్ లు ఒకే వేదికపై కనిపించడం మూడు రాష్ట్రాలలోనూ హాట్ టాపిక్ గా మారింది.

 చెన్నైలో గురువారం (నవంబర్ 5) జరిగిన ఓ వివాహవేడుకలో ఈ  ముగ్గురూ పక్కపక్కనే నిలబడి ముచ్చటించుకుంటూ కనిపించారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో హల్ చల్ చేస్తున్నాయి. 

చెన్నైలోని  లీలా ప్యాలెస్ హోటల్‌లో వైఎస్ కుటుంబానికి చెందిన వైఎస్ కుటంబానికి చెందిన అనిల్ రెడ్డి కుమార్తె  వివాహం జరిగింది.   ఈ వేడుకకు దక్షిణాది రాష్ట్రాల నుంచి పలువురు ప్రముఖ రాజకీయ నాయకులు, సినీ ప్రముఖులు, పారిశ్రామిక దిగ్గజాలు హాజరయ్యారు. అయితే, ఈ వేడుకలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి, కేటీఆర్,   విజయ్ ఒకే దగ్గర చేరి సరదాగా ముచ్చటించుకోవడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.  

ఏపీ రాజకీయాల్లో తనకంటూ ప్రత్యేక ముద్ర వేసుకున్న వైఎస్ జగన్, తెలంగాణ రాజకీయాల్లో దూకుడుగా వ్యవహరిస్తూ బలమైన గళం వినిపిస్తున్న కేటీఆర్, అలాగే తమిళనాట సినీ రంగం నుంచి రాజకీయాల్లోకి వచ్చి సంచలనం సృష్టించిన సీఎం విజయ్ ఒకే వేదికను పంచుకోవడం అందరినీ ఆకర్షించింది.   గతంలోనూ కేటీఆర్,  జగన్ మధ్య మంచి వ్యక్తిగత సంబంధాలు ఉన్నాయనే విషయం తెలిసిందే. పలు సందర్భాల్లో కేటీఆర్ బహిరంగంగానే జగన్‌ను సోదరుడిగా సంబోధిస్తూ తన ఆప్యాయతను చాటుకున్నారు. ఇప్పుడు వారికి తమిళనాడు సీఎం విజయ్ కూడా తోడవడంతో ఈ కలయిక ప్రాధాన్యత సంతరించుకుంది.

ఇది కూడా చదవండి: చంద్రబాబుపై కేటీఆర్ పొగడ్తల వర్షం: ఖండించలేక, సమర్థించలేక జగన్ సతమతం.!

అన్నిటికీ మించి జగన్, కేటీఆర్, విజయ్ లతో ముచ్చటిస్తున్న ఫొటోలు, వీడియోలను ఏపీలో వైసీపీయులు ఏ రకంగా తమ రాజకీయ ప్రచారానికి ఉపయోగించుకుంటారో అన్న ఆసక్తి వ్యక్తమౌతోంది. ఎందుకంటే..  గతంలో కూడా చెన్నైలో జరిగిన ఒక వివాహ వేడుకకు జగన్  హాజరు కావడం.. ఆ పెళ్లికి టీవీకే అధినేత విజయ్ కూడా హాజరు కావడం చర్చనీయాంశం అయిన సంగతి తెలిసిందే. ఆ వివాహ వేడుకలో విజయ్, జగన్ లు పక్కపక్కనే ఉన్నఫొటోలను వైసీపీయులు సోషల్ మీడియాలో పోస్టు చేసి జగన్ కు ఓ రేంజ్ లో ఎలివేషన్ ఇచ్చిన సంగతి తెలిసిందే.

అంతే కాదు, తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలలో విజయ్ విజయం సాధించి సీఎం అయిన తరువాత కూడా ఈ  ఫొటోలను సోషల్ మీడియాలో పెట్టి జగన్ వల్లనే విజయ్ తమిళనాడు సీఎం అయ్యారన్న రేంజ్ లో వైసీపీయులు ప్రచారం చేసుకున్నారు.  ఆ తరువాత ఇంత కాలానికి మళ్లీ చెన్నైలోనే జగన్, విజయ్ లు ఒకే వేదిక మీద పక్కపక్కనే కనిపించడంతో  ఈ సారి ఏ రేంజ్ లో జగన్ కు ఎలివేషన్ ఇవ్వడానికి వైసీపీయులు ప్రయత్నిస్తారో అన్న ఆసక్తి ఏపీలో వ్యక్తమౌతోంది. ఇక ఇఖ్కడ కొసమెరుపేంటంటే.. ఈ వివాహ వేడుకకు విజయ్ తన ఫ్రెండ్ సినీనటి త్రిషతో కలిసి హాజరయ్యారు.  

మీకు నచ్చవచ్చు: విజయవాడకు తమిళనాడు సీఎం విజయ్.. కనకదుర్గమ్మ దర్శనానికి రాబోతున్న దళపతి?

జగన్ చొక్కా మడతపెట్టడం కాదు: జనం జగన్ ను మడతపెట్టేశారు.!

[Jagan Vijay KTR  One Frame, YS Family Wedding,  Chennai, South Indian Politics, YCP, Allivations Telugu One]