జగన్ చొక్కా మడతపెట్టడం కాదు: జనం జగన్ ను మడతపెట్టేశారు.!
Published on: Tue Nov 3, 2026 4:34PM

ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో అధికార ఎన్డీయే కూటమి ఘనవిజయం సాధించిన నేపథ్యంలో తెలుగుదేశం కూటమి పార్టీల్లో ఆనందోత్సాహాలు వెల్లివిరుస్తున్నాయి. పెనుకొండ మున్సిపాలిటీలో కూటమి అభ్యర్థులు సాధించిన విజయాన్ని పురస్కరించుకుని పట్టణంలో భారీ ఎత్తున విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి ఎస్.సవిత మంగళవారం (నంబర్ 3) మీడియాతో మాట్లాడారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం అందిస్తున్న సుపరిపాలనకు, అభివృద్ధికి ఏకపక్షంగా పట్టం కట్టారన్నారు. చొక్కా మడతపెడతానంటూ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేసిన బెదిరింపులకు రాష్ట్ర ఓటర్లు తమ తీర్పుతో గట్టి సమాధానమిచ్చి, ఆయన రాజకీయ ఉనికినే మడతపెట్టి పక్కన పడేశారన్నారు.
పెనుకొండ పురపాలక సంఘం పరిధిలోని మొత్తం 23 వార్డులతో పాటు చైర్మన్ స్థానాన్ని కూటమి అభ్యర్థులు తమ ఖాతాలో వేసుకోవడం చారిత్రాత్మక విజయమన్న మంత్రి సవిత.. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ప్రజల్లో ప్రభుత్వంపై విశ్వాసాన్ని పెంచాయన్నారు. సంక్షేమ ఫలాలు నేరుగా అర్హులకు అందుతుండటంతో పట్టణ ఓటర్లు కూటమి అభ్యర్థులను అత్యధిక మెజార్టీలతో గెలిపించి తమ ఆదరాభిమానాలను చాటుకున్నారని చెప్పారు.
.webp)
పురపాలక పోరు ముగిసిన అనంతరం పెనుకొండ పట్టణ వీధుల్లో నిర్వహించిన విజయోత్సవ ర్యాలీలో మంత్రి సవిత పాల్గొని నగర పౌరులకు ధన్యవాదాలు తెలిపారు. అనంతరం మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి త్రివేంద్రమూర్తితో పాటు విజయం సాధించిన వార్డు కౌన్సిలర్లను ఆమె ప్రత్యేకంగా అభినందిస్తూ సత్కరించారు.
[Penukonda Municipal Election Victory Rally, TDP Janasena BJP Alliance Penukonda, Minister Savitha, AP Local Body Polls, Telugu One]


