జగన్ రిలీజ్: ఇంటి నుంచే..

 

 

 

485 రోజుల సుధీర్ఘ జైలు జీవితం తరువాత విడుదలయిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి కోర్టు విధించిన షరతుల మేరకు హైదరాబాద్ లోని ఇళ్లు, పార్టీ కార్యాలయం నుండి కార్యక్రమాలు వేగవంతం చేస్తారని తెలుస్తోంది. జగన్ రాకతో తమకు ఇబ్బంది తప్పిందని, విధిలేని పరిస్థితుల్లోనే తాము ఇంటి నుండి బయటకు రావాల్సి వచ్చిందని వైఎస్ విజయమ్మ అన్నారు.

 

 

గత ఏడాదికి పైగా ఇబ్బందుల్లో ఉన్న పార్టీని మరింత ఉదృతంగా ముందుకు తీసుకుకెళ్లేందుకు జగన్ హైదరాబాద్ నుండి నిర్ణయాలు తీసుకుంటారని తెలుస్తోంది. రేపు ఉదయం లోటస్ పాండ్ లోని పార్టీ కార్యాలయంలో ఆయన పార్టీ నేతలతో సమావేశం అవుతారని సమాచారం. ఎన్నికలకు ఎంతో దూరం లేని నేపథ్యంలో ఇక సమయాన్ని వృదా చేయడానికి సిద్దంగా లేరని అంటున్నారు.