అప్పులు అయిపోయాయి.. ఇక, విరాళాల వేట.. జగన్ సర్కారు కొత్త ఎత్తు!

అప్పుల ఊబిలో కురుకు పోయి , ఇక అప్పులు పుట్టని స్థితికి చ్రుకున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పుడు కసులకోసం  కొత్త ఎత్తులు వేస్తోందా,అంటే అవుననే అంటున్నారు లోగుట్టు తెలిసిన రాజకీయ విశ్లేషకులు. ఏపీ ప్రభుత్వం పేరు చెపితే ఎక్కడా పైసా అప్పు పుట్టడం లేదు. అవకాశం  ఉన్న వరకు అప్పు పాత్రలు అన్నింటినీ జగన్ రెడ్డి ప్రభుత్వం ఎప్పుడోనే పూర్తిగా తుడిచేసింది.(గిట్టని వాళ్ళు అయితే నాకేసిందని అంటారనుకోండి అది వేరే విషయం,)  ఇక ఎక్కడా రూపాయి కాదు కదా, హాఫ్ రూపీ అప్పు కూడా పుట్టే పరిస్థితి లేదనేది అందరికి తెలిసిన విషయమే.  రాష్ట్ర్ర ఆర్థిక పరిస్థితి అత్యంత దయనీయంగా ఉందని స్వయంగా ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, పార్లమెంట్ ఉభయ సభలలో  వైసేపీ  నాయకులు ఒకటికి రెండు సార్లు గోడు వెళ్ళబోసుకున్నారు. సో, రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక  స్థితి అధ్వాన్నంగా ఉందని కానీ, అప్పులు పుట్టని దుస్థితి ఉందని గానీ , వేరే ఎవరూ చెప్పనక్కరలేదు. 

అందుకే, ఇక ఇలా కాదని, ఏపీ ప్రభుత్వం కాసు కొత్త ఎత్తులు వేస్తోందని విస్వవసనీయ వర్గాల సమాచారం. అప్పులు ఇవ్వకపోతే ఇవ్వక పోయారు, విరాళాలు అయినా ఇవ్వండని, దేశీయ, అంతర్జాతీయ దాతృత్వ సంస్థలను వేడుకునేందుకు, ఏపీ ప్రభుత్వం సిద్డంవుతోందని అధికార వర్గాల సామాచారం.  ప్రస్తుతానికి, నాడు – నేడు పేరుతొ అమలవుతున్న పాఠశాల భవనాల రంగులు, హంగులు కార్యక్రమానికి, అదనపు తరగతి గదుల నిర్మాణానికి దాతలనుంచి విరాళాలు సేకరించాలని ప్రభుత్వం నిర్ణయానికి వచ్చింది. పాఠశాలలో ఆవసరం మేరకు అదనపు తరగతి గదుల నిర్మాణానికి, రూ.6321 కోట్లు అవసరమని గుర్తించి ప్రభుత్వం జాతీయ, అంతర్జాతీయ దాతృత్వ సంస్థల నుంచి విరాళాలుసేకరించాలని నిర్ణయించిందని తెలుస్తోంది. ఇందుకు సంబందించిన విధివిధానాలు, ప్రభుత్వ ఉత్తర్వులు త్వరలోనే విడుదల అవుతాయని, అదికార వర్గాలు అంటున్నాయి. 

అయితే జగన్ రెడ్డి ప్రభుత్వం తీసుకున్నఈ నిర్ణయం వెనక చాల పెద్ద కుట్ర ఉందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. విదేశీ విరాళాల విషయంలో కేంద్ర ప్రభుత్వం ఇటీవల ఆంక్షలను కఠినతరం చేసింది. దేశంలో ఇంచుమించుగా ఆరు వేల వరకు స్వచ్చంద సంస్థల లైసెన్సులను కేంద్రహోమ్ శాఖ రద్దు చేసింది. అంటే ఆ సంస్థలకు ఇక విదేశాల నుంచి విరాళాలు రావు. ఇందులో టీటీడీ సహ, ఐఐటీ ఢీల్లీ, జమియా మిలియా ఇస్లామియా, నెహ్రూ మెమోరియల్‌ మ్యూజియం వంటి సంస్థలు ఉన్నా, సేవా కార్యక్రమాల ముసుగులో మతమార్పిడులకు పాల్పడే, క్రైస్తవ సంస్థలే ఎక్కువగా ఉన్నాయి. ముఖ్యంగా, ఏపీలో జగన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత క్రైస్తవ మత ప్రచారం, మత మార్పిడులు ఏ స్థాయిలో జరుగుతున్నాయో వేరే చెప్పనక్కరలేదు. ఈ నేపధ్యంలోనే నాడు – నేడు పేరిట విదీశీ మిషనరీలకు బ్యాక్ డోర్ ఎంట్రీ కలిపించేందుకు, జగన్ రెడ్డి ఈ ఎత్తు వేశారా, అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే ఇందుకు సంబందించిన విధివిధానాలు వెలువడితేనే గానీ, అసలు కుట్ర ఏమిటన్నది తేలదు. స్వచ్చంద సంస్థలు ఇచ్చే విరాళాలను ప్రభుత్వం నేరుగా సేకరిస్తుందా, లేక అప్పుల కోసం ఏపీ డెవలప్మెంట్ కార్పొరేషన్ పేరిట,ఒక సూట్ కేసు సంస్థను ఏర్పాటు చేసిన విధంగా విరాళాల సేకరణకు మరో సూట్ కేసు సంస్థను ఏర్పాటు చేస్తుందా, అనేది తేలితే గానే, విరాళాల అసలు రంగు బయట పడదని అంటున్నారు. అయితే, అంతర్జాతీయ క్రైస్తవ మిషనరీలతో వైఎస్సార్ కుటుంబానికి ఉన్న సంబంధాల దృష్ట్యా అనుమానాలకు బలం చేకూరుతోందని అంటున్నారు.