జగన్ అకౌంట్లో ఇంకో దిక్కుమాలిన ఇంటర్వ్యూ

ఈ ఎన్నికల సందర్భంగా ప్రచారంలో జగన్ చెబుతున్న అబద్ధాలు విని జనం చీదరించుకుంటున్నారు. వీటికంటే ఎక్కువ ఇరిటేషన్ కలిగిస్తున్న అంశం.. వివిధ మీడియా సంస్థలకు జగన్ ఇస్తున్న ఇంటర్వ్యూలు. మొన్నామధ్య ఒక నేషనల్ మీడియా సంస్థకు జగన్ ఇచ్చిన ఇంటర్వ్యూ పరమ చెత్త ఇంటర్వ్యూగా దేశవ్యాప్తంగా గుర్తింపు పొందింది. జర్నలిస్టు అడిగిన ప్రశ్నలకు వెకిలి నవ్వులతో సమాధానాలు దాటవేయడం, పరమ చెత్త ఇంగ్లీషు మాట్లాడ్డం, అర్థంపర్థం లేని ఎక్స్.ప్రెషన్లు ఇవ్వడం, ఆడపిల్లలా సిగ్గుపడిపోవడం, జాతీయ రాజకీయాల గురించి తనకు అంతగా ఐడియా లేదని అనడం... ఇవన్నీ చూసి దేశవ్యాప్తంగా జనం ఇలాంటి ముఖ్యమంత్రి ఆంధ్రా జనం ఇన్నేళ్ళు ఎలా భరించార్రా బాబూ అనుకున్నారు. ఆ తర్వాత ప్రముఖ జర్నలిస్టు రాజ్దీప్ సర్దేశాయ్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో కూడా ఇదే పరిస్థితి. ఏ ప్రశ్న అడిగినా నాలుక చివర రెడీగా వున్న అబద్ధాలను చెప్పుకుంటూ వెళ్ళారు. జగన్ ఇస్తున్న ఇంటర్వ్యూల పరిస్థితి ఎలా వుందంటే, ఇంటర్వ్యూ చేసిన వాళ్ళకి, చూసిన వాళ్ళకి జీవితం మీద విరక్తి కలిగేలా పరిస్థితి తగలడింది. ఇలాంటి పరిస్థితిలో జగన్ మళ్ళీ ఒక తెలుగు మీడియా సంస్థకు ఇంటర్వ్యూ ఇచ్చారు. పోనీ, తెలుగు మీడియా సంస్థ కదా, తెలుగులోనే మాట్టాడతాడు కదా ఇంటర్వ్యూలో కొంచెం క్లారిటీ వుంటుందేమో అనుకుంటే, అన్ని ఇంటర్వ్యూల కంటే నీచ నికృష్టంగా ఏడిచింది ఈ ఇంటర్వ్యూ..

ఇంగ్లీషు మీడియా సంస్థలకు ఇచ్చిన ఇంటర్వ్యూలలో నసుగుతూ సమాధానాలు ఇచ్చిన జగన్ తెలుగు మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలలో అత్యంత మూర్ఖంగా సమాధానాలు ఇచ్చారు. జగన్ మూర్ఖుడని తెలుసుగానీ, మరీ ఇంత మూర్ఖ శిఖామణి అని తెలియదే అనేలా ఈ ఇంటర్వ్యూ సాగింది. అప్పులు తెచ్చి అందరికీ పంచడమే తప్ప అభివృద్ధి ఎక్కడ వుంది మహానుభావా అంటే, ఫిషింగ్ హార్బర్లు ఏర్పాటు చేస్తున్నాము కదా అని సమాధానం చెప్పారు. ఫిషింగ్ హార్బర్లు కడితే అభివృద్ధి ఎందుకు అవుతుంది అని అడిగితే, ఫిషింగ్ హార్బర్ వల్లే కోల్‌కతా కోల్‌కతా అయిందట, ఫిషింగ్ హార్బర్ వల్లే ముంబై ముంబై అయిందట. అందుకే వైజాగ్‌ని వైజాగ్ చేయడం కోసం ఫిషింగ్ హార్బర్ ఏర్పాటు చేశారట. ఈయన రాకముందు వైజాగ్‌లో ఎవరూ ఫిషింగ్ చేయకుండా చెక్కభజన చేస్తూ వుండేవారు.. ఈయన వచ్చాక అక్కడ జనానికి చేపలు పట్టడం నేర్పారు.. 

పవన్ కళ్యాణ్ మూడు పెళ్ళిళ్ళు చేసుకుంటే మీకేం ప్రాబ్లం.. అది ఆయన వ్యక్తిగత విషయం, చట్టబద్ధమైన విషయం ఆ విషయం మీరు మాటమాటకీ ఎందుకు ప్రస్తావిస్తారు. ఆ పాయింట్ మీద పిఠాపురంలో పవన్ కళ్యాణ్‌కి ఓటు వేయొద్దని అనడం ఎంతవరకు కరెక్ట్ అని అడిగితే, జగన్ మరీ మూర్ఖంగా ఆ పాయింట్ మీదే పవన్ కళ్యాణ్‌కి ఓటు వేయొద్దని అంటాను అని మొండిగా వాదించారు. ఈ ఇంటర్వ్యూలో జగన్ చెప్పిన అనేక వితండవాద సమాధానాలు ఆక్ ఈజ్ పాక్ పాక్ ఈజ్ ఆక్.. ఆక్ పాక్ కరేపాక్ అన్నట్టుగా ఏడిచాయి. 

బాబాయ్ హత్య గురించి ప్రశ్నిస్తే అది దిక్కుమాలిన ఎక్స్.ప్రెషన్తో సంబంధం లేని సమాధానాలు. ఈ ఐదేళ్ళలో హంతకుడిని ఎందుకు పట్టుకోలేదు మగడా అంటే, బాబాయ్‌కి రెండో పెళ్ళి అయింది.. కొడుకు కూడా వున్నాడు.. ఇదీ జగన్ సమాధానం. బాబాయ్ హత్య గురించి టీవీలో అవినాష్ రెడ్డి మాట్లాడింది విని ఈయనకి అవినాషే మంచోడు అనిపించిందట. అందుకే అవినాష్‌కి మద్దతుగా నిలిచాడట. ఇలాంటి  ఆణిముత్యాలు జగన్ ఇంటర్వ్యూలో చాలా వున్నాయి. మొత్తమ్మీద జగన్ అకౌంట్లో మరో దిక్కుమాలిన ఇంటర్వ్యూ చేరింది.