TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

జగన్ అక్రమాస్తుల కేసు: దర్యాప్తు సంస్థలను స్టేటస్ రిపోర్టు కోరిన తెలంగాణ హైకోర్టు.!

Published on: Sat Nov 21, 2026 11:42AM

వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి  జగన్ పై చాలాకాలంగా పెండింగ్‌లో ఉన్న ఆదాయానికి మించిన ఆస్తుల కేసులు, దర్యాప్తు సంస్థల  తాజా నివేదికను తెలంగాణ హైకోర్టు కోరింది. దీంతో జగన్ ఆస్తుల కేసుల చర్చ మరో సారి ఉభయ తెలుగు రాష్ట్రాలలోనూ మొదలైంది. రానున్న రోజులలో ఈ కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకునే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయంటూ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 

జగన్ అక్రమాస్తుల కేసుల   విచారణను వేగవంతం చేయాలని కోరుతూ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్, అలాగే  మాజీ మంత్రి చేగొండి హరిరామజోగయ్య దాఖలు చేసిన పిటిషన్లపై తెలంగాణ హైకోర్టు   ధర్మాసనం విచారణ జరిపింది.  కేసుల వివరాలను సమర్పించడానికి మూడు వారాల సమయం కావాలని సీబీఐ, ఈడీలు కోర్టుకు తెలిపాయి. దీంతో  తదుపరి విచారణను హైకోర్టు నవంబర్ 30కి వాయిదా వేసింది.

ఇక్కడ చెప్పుకోవలసినదేంటంటే.. ఈ కేసుల పరిధి పెద్దది.  మనీలాండరింగ్ ఆరోపణలకు సంబంధించి సీబీఐ 11 ఛార్జిషీట్లు దాఖలు చేయగా, ఈడీ కూడా 11 ఛార్జిషీట్లు దాఖలు చేసింది. దాదాపు 15 ఏళ్లుగా ఈ విచారణలు పెండింగ్‌లో  ఉన్నాయి. ఈ జాప్యానికి ఈ కేసులకు సంబంధించి దాఖలైన  150కి పైగా డిశ్చార్జ్ పిటిషన్లు. 

ఈ  డిశ్చార్జ్ పిటిషన్ల వల్ల విచారణల పురోగతి మందగించిందని కోర్టుకు తెలిపిన ఈడీ.. కేసుల విచారణ వేగవంతం కావాలంటే..రోజు వారీ విచారణ జరపాలనీ, అలాగే..  నిందితులు వ్యక్తిగతంగా కోర్టుకు హాజరు అయ్యేలా ఆదేశాలు జారీ చేయాలనీ కోరింది. 

ఇది కూడా చదవండి: జగన్ కు షాక్: అక్రమాస్తుల కేసులో రోజు వారీ విచారణ, వ్యక్తిగత హాజరు: సీబీఐ కోర్టు నిర్ణయం.!

జగన్ కేసులపై ప్రతి రోజూ విచారణ సరిపోదు: రోజంతా జరపాలి: ఈడీ పిటిషన్‌కు సోమిరెడ్డి మద్దతు.!

దీనిపై హైకోర్టు.. ముందు స్టేటస్ రిపోర్టులు పరిశీలిస్తామనీ, ఆ తరువాత తదుపరి కార్యాచరణ నిర్ణయిస్తామని పేర్కొంది.  అదలా ఉండగా జగన్ అక్రమాస్తుల కేసులను సత్వరమే ముగించే దిశగా అడుగులు పడుతున్నాయని పరిశీలకులు అంటున్నారు. 

నిర్దిష్ట కాల వ్యవధి అన్ని పరిమితి లేకపోయినప్పటికీ,   తాజా పరిణామాలు విచారణ  వేగవంతం చేయమని ఏజెన్సీలు , యు ట్రయల్ కోర్టుపై ఒత్తిడి పెరిగేందుకు దోహదపడుతుందనడంలో సందేహం లేదు.   

మీకు నచ్చవచ్చు: 

[Jagan disproportionate assets, Cases, status reportTelangana High Court, ED,  CBI, TeluguOne]