తొలి తెలుగు న్యూస్ రీడర్ శాంతి స్వరూప్ ఇక లేరు

తెలుగులో తొలి న్యూస్ రీడర్  శాంతి స్వరూప్ శుక్రవారం (ఏప్రిల్ 5) ఉదయం కన్నుమూశారు.  ఆయన మరణంతో  తెలుగు మీడియా పరిశ్రమ విషాదంలో మునిగిపోయింది.

దూరదర్శన్ ఛానెల్‌లో పనిచేసిన శాంతి స్వరూప్, తెలుగు ప్రసారాల్లో తొలి న్యూస్ రీడర్‌. దూరదర్శన్ ఛానల్ ప్రారంభించిన తొలినాళ్లలో ఆయన తెలుగువారికి న్యూస్ రీడర్ అన్న పదానికి పర్యాయపదంగా ఉండేవారు.

తన  వాయిస్, దోషరహిత ఉచ్ఛారణ, సమకాలీన విషయాలపై అవగాహనతో  ప్రేక్షకుల అభిమానానికి పాత్రుడయ్యారు. శాంతి స్వరూప్ మరణంతో తెలుగు ప్రసార మాధ్యమంలో ఒక శకం ముగిసినట్లుగా చెప్పవచ్చు.   

Online Jyotish
Tone Academy
KidsOne Telugu