ఎన్నిక‌ల‌కు జ‌గ‌న్ సిద్ధ‌మా? ... ర‌ఘురామ కృష్ణంరాజు స‌వాలు

జ‌గ‌న్ స‌ర్కార్‌కి వైసీపీ ఎంపీ ర‌ఘురామ కృష్ణంరాజు మ‌ళ్లీ హెచ్చ‌రిక చేశారు. త‌న రాజీనామా కోర‌డం అర్ధ ర‌హిత‌మ‌ని దాని వ‌ల్ల ప్ర‌జ‌ల‌కు ప్ర‌త్యేకించి చేకూరే ప్ర‌యోజ‌న‌మేమిట‌ని ప్ర‌శ్నించారు. రాజీనామా చేసినా తాను మ‌ళ్లీ పోటీచేసి త‌ప్ప‌కుండా గెల‌వ‌గ‌ల‌న‌న్న ధీమా వ్య‌క్తం చేశారు. ఆయ‌న ఆగ‌ష్టు  26న ఢిల్లీ లో విలే క‌రుల‌తో మాట్లాడుతూ తాను రాజీనామాకు సిద్ధ‌మేన‌ని,  సీఎం జ‌గ‌న్ త‌న ప్ర‌భుత్వాన్ని ర‌ద్దు చేసి ఎన్ని క‌ల‌కు వెళ్ల‌డానికి సిద్ధ‌మేనా అని స‌వాలు విసిరారు. జ‌గ‌న్ అందుకు లిఖిత పూర్వ‌క హామీ ఇవ్వాల‌న్నారు. 

తనపై ఫిర్యాదు చేస్తానని ఏ2 పేర్కొనడం హాస్యాస్పదమని, పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌,  స్టట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా అధికారులతో కలిసి గతంలోనే ఎన్నో చేయరాని పనులు చేశారు కదా! అని వ్యాఖ్యానించారు. ప్రధాని మోదీ, జగన్‌ను ఢిల్లీకి పిలిపి చీవాట్లు పెట్టారని... రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక అరాచకాలు, అప్పులపై ప్రధాని ఆగ్రహం వ్యక్తం చేేస్త ముఖ్యమంత్రి బయటికి వచ్చి ఏవో కబుర్లు చెప్పుకొచ్చారని ఎద్దేవా చేశారు.  

ప్రస్తుతం టీడీపీకి 18 స్థానాలు ఉన్నాయని, ఆ 75కు 18 కలిపితే 93 స్థానాలే అవుతాయని, తన సర్వే తప్పె లా అవుతుందని ప్రశ్నించారు. కాగా, జార్ఖండ్‌ ముఖ్యమంత్రి హేమంత్‌ సోరెన్‌పై అనర్హత వేటు వేస్తే, ఏపీ సీఎం జగన్‌కు కూడా ఇబ్బందులు తప్పకపోవచ్చునని ఆయన వ్యాఖ్యానించారు.  ప్రభుత్వ ఖజానాను జలగల్లా పీలుస్తున్న జగన్‌ సలహాదారులు పదవుల నుంచి తప్పు కావాలంటూ ఆయన డిమాండ్‌ చేశారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu