190 పరుగులకే పరిమితమైన ఆర్సీబీ..భారం మొత్తం బౌలర్లపైనే

 

 

ఐపీఎల్ 2025 ఫైనల్ మ్యాచ్‌లో టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు శుభారంభం దక్కలేదు దూకుడుగా ఇన్నింగ్స్ ప్రారంభించిన ఫిల్ సాల్ట్.. కైల్ జెమీసన్ బౌలింగ్‌లో క్యాచ్ ఔట్‌గా వెనుదిరిగాడు. క్రీజులోకి వచ్చిన మయాంక్ అగర్వాల్, విరాట్ కోహ్లీ ఆచితూచి ఆడటంతో పవర్ ప్లేలో ఆర్‌సీబీ వికెట్ నష్టానికి 55 పరుగులు చేసింది.

పవర్ ప్లే ముగిసిన వెంటనే యుజ్వేంద్ర చాహల్‌ను రంగంలోకి దింపిన అయ్యర్.. ఆశించిన ఫలితాన్ని రాబట్టాడు. ఫిలిప్ సాల్ట్ 16 పరుగులు,మయాంక్ అగర్వాల్ 24, రజాత్ పాటిదార్ 26  విరాట్ కోహ్లీ(43), పరుగుల వద్ద ఔటయ్యారు.మయాంక్ అగర్వాల్ (24), కెప్టెన్ రజాత్ పాటిదర్(26), లివింగ్ స్టోన్ (25), జితేశ్ శర్మ (24), షెఫార్డ్ (17) పరుగులతో రాణించారు. పంజాబ్ జట్టు విజయం సాధించాలంటే 191 పరుగులు చేయాల్సి ఉంది. ఇక పంజాబ్ బౌలర్లలో జెమిసన్ మూడు వికెట్లు తీయగా, అర్షదీప్ సింగ్ మూడు వికెట్లు, అజ్మతుల్లా ఒమర్ జాయ్, యుజ్వేంద్ర చాహల్, విజయ్ కుమార్ తలో వికెట్ తీశారు.ఆర్‌సీబీ భారం మొత్తం బౌలర్లపైనే పెట్టారు.
 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu