అహ్మదాబాద్‌లో వర్షం..మ్యాచ్ రద్దయితే కప్ ఎవరికంటే?
posted on Jun 3, 2025 5:22PM

ఐపీఎల్ 2025 ఫైనల్ పోరులో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ), పంజాబ్ కింగ్స్ జట్లు మధ్య జరిగే అహ్మదాబాద్ నరేంద్ర మోదీ స్టేడియం వద్ద వర్షం మొదలైంది. ఇప్పుడిప్పుడే అభిమానులు స్టేడియంలోకి అడుగుపెడుతున్నారు. వర్షం కురుస్తుండటంతో వారంతా ఆందోళన చెందుతున్నారు. అయితే మ్యాచ్ ప్రారంభనికి సాయంత్రం 7:30 గంటలకు సమయం ఉండటంతో అప్పటిలోగా వాన తగ్గే ఛాన్సుంది. కాగా వర్షం పడి మ్యాచ్ రద్దు అయితే రేపు రిజర్వేడే ఉంది.
అప్పుడూ కుడా మ్యాచ్ సాధ్యం కాకపోతే లీగ్ స్టేజీలో టాప్‌లో నిలిచిన పంజాబ్ కింగ్స్ దే టైటిల్. చిరు జల్లులు కాస్త భారీ వర్షంగా మారితే ప్రమాదం అని... గ్రౌండ్ బాయ్స్ కూడా చాలా కష్టపడుతున్నారు. వెంటనే మోదీ స్టేడియం మొత్తం కవర్స్ తో కప్పే ప్రయత్నం చేస్తున్నారు. దీనికి సంబంధించిన ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే ఇవాళ వర్షం లేదని ఉదయం వాతావరణ శాఖ స్పష్టం చేసింది. నేటి మ్యాచ్‌లో మొదట టాస్ గెలిచిన జట్టు బౌలింగ్ తీసుకునే ఛాన్స్ ఉంది