ఇండోనేసియా ఫ్యాక్టరీలో అగ్నిప్రమాదం: 24 మంది మృతి.. పలువురు గల్లంతు.!
Published on: Tue Nov 24, 2026 9:19AM
.webp)
ఇండోనేసియాలోని ఓ ఫ్యాక్టరీలో జరిగిన అగ్నిప్రమాదంలో కనీసం 24 మంది సజీవదహనమయ్యారు. సెరాంగ్ రీజెన్సీ పరిధిలోని సికాండే ప్రాంతంలోని ఓ క్యాండీ ఫ్యాక్టరీలో ఈ ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో 24 మంది మృత్యువాత పడగా, మరో 30 మందికిపైగా తీవ్రంగా గాయపడ్డారు. పలువురు గల్లంతయ్యారు. గల్లంతైన కార్మికుల కోసం ఫ్యాక్టరీ శిథిలాలలో గాలింపు చర్యలు చేపట్టారు.
ప్రమాదం జరిగిన సమయంలో ఫ్యాక్టరీలో 300 మంది కార్మికులు విధుల్లో ఉన్నారు. అకస్మాత్తుగా చెలరేగిన మంటలు వేగంగా వ్యాపించడంతో చాలా మంది కార్మికులకు తప్పించుకునే అవకాశం లేకుండా పోయింది.
ఎయిర్ కండిషనర్ యూనిట్‌లో ఏర్పడిన షార్ట్ సర్క్యూట్ వల్లే ఈ ప్రమాదం జరిగి ఉండొచ్చని భావిస్తున్నారు. ప్రమాదంలో చిక్కుకున్న వారిలో 29 మంది సురక్షితంగా బయటపడ్డారు. 24 మృతదేహాలను వెలికి తీశారు.
.webp)
గల్లంతైన వారి కుటుంబ సభ్యులు ఫ్యాక్టరీ పరిసరాలు, సహాయక కేంద్రాల వద్ద తమ ప్రియమైనవారి ఆచూకీ కోసం నిరీక్షిస్తున్నారు. ఒకవైపు శిథిలాల తొలగింపు, గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.
ఇది కూడా చదవండి: మోండా మార్కెట్‌లో ఘోర అగ్ని ప్రమాదం
రోజుల్లో శిథిలాల తొలగింపు ప్రక్రియ పూర్తైన తరువాత గల్లంతైన వారి గురించిన స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ప్రమాద తీవ్రతను బట్టి మృతుల సంఖ్య భారీగా ఉండొచ్చన్న ఆందోళణ వ్యక్తమౌతోంది.

మొత్తంగా చూస్తే, క్యాండీ ఫ్యాక్టరీ అగ్నిప్రమాద ఘటనలో మృతుల గుర్తింపు, గల్లంతైన వారి గాలింపు, విచారణ ప్రక్రియ కొనసాగుతోంది. బాధిత కుటుంబాలకు త్వరితగతిన సమాచారం అందాలని, భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలు జరగకుండా కఠిన భద్రతా చర్యలు తీసుకోవాలని ప్రజలు, బాధిత కుటుంబాలు కోరుతున్నాయి.
మీకు నచ్చవచ్చు: కోల్ కతాలో అగ్ని ప్రమాదం.. తొమ్మండుగురు సజీవదహనం.!
హస్తినలో అగ్ని ప్రమాదం: నలుగురు మృతి.!
[Indonesia, Factory, Fireaccident, Candyfactorydisaster, 24 dead, TeluguOne]


