హస్తినలో అగ్ని ప్రమాదం: నలుగురు మృతి.!
Published on: Sat Oct 31, 2026 10:20AM

దేశ రాజధాని హస్తినలో శుక్రవారం (సెప్టెంబర్ 30) అర్ధరాత్రి దాటిన తరువాత జరిగిన అగ్ని ప్రమాదంలో నలుగురు సజీవదహనమయ్యారు. మరో నలుగురు తీవ్రంగా గాపడ్డారు. కాగా అగ్నిమాపక సిబ్బంది మరో ఆరుగురిని సురక్షితంగా కాపాడారు. ఢిల్లీలోని మంగోల్‌పురి ప్రాంతంలో ఉన్న ఒక చెప్పుల తయారీ ఫ్యాక్టరీలో ఈ ప్రమాదం సంభవించింది.
అర్ధ రాత్రి సమయంలో ఫ్యాక్టరీలోని బేస్‌మెంట్ ప్రాంతం నుంచి ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. ఫ్యాక్టరీలో భారీగా ఉన్న రబ్బరు సామగ్రి , చెప్పుల ముడిసరుకు కారణంగా మంటలు క్షణాల్లో వేగంగా వ్యాపించాయి. గాఢ నిద్రలో ఉన్న కార్మికులకు తప్పించుకునే అవకాశం లేకుండా పోయింది. సమాచారం అందుకున్న వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్న సిబ్బంది అతి కష్టం మీద మంటలను అదుపు చేశారు.
.webp)
ఫ్యాక్టరీలో చిక్కుకున్న ఆరుగురు కార్మికులను సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు. ఈ ప్రమాదంలో క్షతగాత్రులైన వారు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఈ ప్రమాదం జరిగిందని ప్రాథమికంగా భావిస్తున్నారు.
[Delhi Fire Accident, Mangolpuri Chappal Factory Fire, Four Dead, Rescue Operation, Telugu One]


