TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

చైనా సరిహద్దులో మౌలిక సదుపాయాల వృద్ధి: సైనిక మోహరింపు ఇప్పుడు మరింత కీలకం.!

Published on: Sun Nov 15, 2026 10:36AM

భారత్-చైనా సరిహద్దు ఇప్పుడు క్రియాశీలంగా మారింది.  సరిహద్దు వెంబడి  మౌలిక వసతుల అభివృద్ధి కారణంగా, ఆ ప్రాంతం  సజీవంగా మారింది.   దీనివల్ల సరిహద్దు రక్షణ కోసం మునుపటి కంటే చాలా పెద్ద సంఖ్యలో దళాలను అక్కడ నిరంతరం నిరంతరం మోహరించాల్సిన అవసరం గతంలో కంటే చాలా చాలా ఎక్కవగా ఉంది. గత కొన్ని సంవత్సరాలుగా  ఇండియా చైనా సరిహద్దు వెంబడి కొత్త సొరంగాలు, వంతెనలు, విమానాశ్రయాల నిర్మాణం జోరుగా సాగుతున్న విషయం విదితమే. 

ఇదే విషయాన్ని విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్ పునరుద్ఘాటించారు. ఇటీవల ఒక కార్యక్రమంలో మాట్లాడిన ఆయన, గత దశాబ్ద కాలంలో సరిహద్దు మౌలిక వసతుల రంగంపై ప్రత్యేక దృష్టి సారించిన కేంద్ర ప్రభుత్వం,  నిధుల కేటాయించడమే కాకుండా విధానపరమైన మద్దతు ఇచ్చిందని చెప్పారు.  దశాబ్దాల పాటు తీవ్ర నిర్లక్ష్యానికి గురైనా ఇండియా చైనా సరిహద్దు ప్రాంతాలలో ఈ దశాబ్ద కాలంలో పరిస్థితి పూర్తిగా మారిందన్నారు.  

సరిహద్దు ప్రాంతాలలో మెరుగైన కనెక్టివిటీ అందుబాటులోకి రావడం వల్లనే భారత సైన్యం త్వరితగతిన బలగాలను తరలించే సామర్థ్యాన్ని సంతరించుకుందని ఆయన వెల్లడించారు. ఈ వేగవంతమైన అభివృద్ధి కారణంగానే గగనతల, భూతల మార్గాల్లో రక్షణ ఏర్పాట్లు మరింత పటిష్టమయ్యాయన్నారు.

ఇండియా, చైనా  మధ్య  ఆర్థిక అసమానతల అంశంపై జయశంకర్..  గతంలో భారత్ కొన్ని దశాబ్దాల పాటు పారిశ్రామికీకరణలో వెనుకబడిపోవడం వల్లనే ఈ అంతరం ఏర్పడిందన్నారు.   1980లలో భారత్ తగిన విధంగా పారిశ్రామికాభివృద్ధిపై దృష్టి పెట్టలేకపోయిందని, ఆ తర్వాత కాలంలో సంస్కరణలు చేపట్టినప్పటికీ ఆ వేగాన్ని నిలబెట్టుకోవడంలో కొంత ఇబ్బంది పడ్డామని చెప్పారు. ప్రస్తుతం ఈ లోటును పూడ్చుకోవడానికి భారత్   సాంప్రదాయ మార్గాలనే కాకుండా,  కొత్త పద్ధతుల్లో దూసుకుపోవాలన్నారు. 

ఇది కూడా చదవండి:  భారత్ చైనా సరిహద్దులో ఘర్షణ.. ముగ్గురు భారత్ జవాన్ల మృతి

ప్రతి రంగంలోనూ ప్రత్యక్షంగా పోటీ పడకుండా, దేశానికి తగిన ప్రత్యేక బలాలను పెంపొందించుకోవడంపైనే ప్రస్తుతం కేంద్రం దృష్టి పెట్టిందని జైశంకర్ స్పష్టం చేశారు. తూర్పు లడఖ్ సైనిక ప్రతిష్టంభన తర్వాత భారత్ చైనా సంబంధాలు క్రమంగా సాధారణ స్థితికి వస్తున్న తరుణంలో ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. సరిహద్దు భద్రతపై ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీ పడే ప్రశక్తే లేదని కుండబద్దలు కొట్టారు. 

భవిష్యత్తులోనూ సరిహద్దు ప్రాంతాల్లో శాంతిభద్రతలను పరిరక్షించడంతో పాటు, ఏదైనా అత్యవసర పరిస్థితిని ఎదుర్కొనేలా సైనిక సన్నద్ధతను ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉంచాల్సిన అవసరం ఉందని నిపుణులు భావిస్తున్నారు. మౌలిక వసతుల అభివృద్ధి ద్వారా దేశ రక్షణ వ్యవస్థ మరింత బలోపేతం కావడం వల్ల భద్రతా దళాల పనితీరు మెరుగవుతుందని అంచనా వేస్తున్నారు. ఈ పరిణామాలు జాతీయ భద్రతా పరంగా భారత్‌కు ఎంతో కీలకమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

మీకు నచ్చవచ్చు:  లెక్క తేలింది.. గాల్వాన్ లోయలో వంద మంది చైనా సైనికులు మరణించారు!!

 

అమెరికా విద్యార్థులకు చైనా ఆహ్వానం: అమెరికాతో చెలిమి దిశగా ముందడుగు.!

[India China border, Infrastructure, Developement, jaishanker, TeluguOne]