దార్శనికుడు పాలకుడైతే..

ఓ సైబరాబాద్.. ఓ కియా ఫ్యాక్టరీ

ఓ బిడ్డకు జన్మనిచ్చే సమయంలో ఆ తల్లి పడే ప్రసవవేదన ఏమిటో మన అందరికీ తెలిసిందే… అలాగే ఒక పరిశ్రమ … ఒక ప్రాజెక్ట్ నిర్మాణానికి భూములు కోల్పోయే రైతులు పడే ఆవేదన అంతకు ఏ మాత్రం తక్కువ కాదు.   తాను జన్మనిచ్చిన బిడ్డ  బుడిబుడి నడకలు వేస్తూ… బోసినవ్వుల మాటలు చెబుతూ ఉంటే ఆ తల్లి ఆనందానికి అవధులు ఉండవు… అలాగే పరిశ్రమలు , ప్రాజెక్టులు పూర్తయి ఫలాలు అందరికీ అందినప్పుడూ ప్రజల ఆనందం, వారి అనుభూతి   మాటల్లో చెప్పలేనిదనడంలో సందేహం లేదు. 

దీనికి ఉదాహరణే దార్శనికుడు ముఖ్యమంత్రి చంద్రబాబు చేపట్టిన కార్యక్రమాలు….. హైదరాబాద్ లో హైటెక్ సిటీ నిర్మాణ సమయంలో గిట్టని వాళ్ళు చేసిన విమర్శలు… హేళనలు  అన్నీ ఇన్నీ కావు.. కానీ నేడు అదే హైటెక్ సిటీ ఒక కొత్త నగరాన్నే నిర్మించింది.. తెలంగాణ రాష్ట్రానికి ప్రధాన ఆర్థిక వనరుగా నిలిచింది… రాష్ట్రం విడిపోయాక ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ లో కూడా ముఖ్యమంత్రి గా చంద్రబాబు దూరదృష్టి తో ఆవిష్కరించినదే కియా కార్ల తయారీ పరిశ్రమ… కరవు కాటకాలకు నెలవైన అనంతపురం జిల్లా పెనుగొండ ప్రాంతంలో కార్ల తయారీ కర్మాగారాన్ని 536 ఎకరాలను కేటాయించారు..  కొండలు .. గుట్టలతో ఉన్న ఆ ప్రాంతాన్ని చదును చేసి  కియా కార్ల కంపెనీకి అప్పగించారు.  కర్మాగారానికి అవసరమైన నీటిని కూడా కేటాయిస్తూ జీవోలు విడుదల చేశారు. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్ లో హైటెక్ నిర్మాణం చేపట్టినప్పుడు ఎదురైన విమర్శలే ఇక్కడా వినిపించాయి.. అయినా చంద్రబాబు ఇవేవీ పట్టించుకోకుండా ముందడుగు వేశారు. 

కరువు సీమలో నీటిని సాగుభూములకు ఇవ్వకుండా కార్పొరేట్ సంస్థలకు ఇస్తున్నారని విపక్షాలు విమర్శలు చేశాయి. కానీ కర్మాగారం వస్తే ఆ ప్రాంతం ఎలా అభివృద్ధి చెందుతుందో రైతులకు వివరించి మరీ ఒప్పించారు చంద్రబాబు.  2017లో కర్మాగారం నిర్మాణానికి శంకుస్థాపన జరిగింది.  2019 నాటికి ఉత్పత్తి ప్రారంభించగానే..   మొదటి ఏడాదిలోనే 50 వేలకు పైగా కార్లను ఉత్పత్తి చేసిన కియా కంపెనీ,  2025 నాటికి 15 లక్షల కార్లు ఉత్పత్తి చేసింది…ఏటా 3 లక్షల కార్లను మార్కెట్లోకి విడుదల చేయాలన్న లక్ష్యంగా మూడో షిఫ్ట్ జోడించారు. చంద్రబాబు హయాంలో కర్మాగారం పనులు సాఫీగా సాగాయి.  ప్రభుత్వం మారాక కొన్ని బాలరిష్టాలను ఎదుర్కోవడం జరిగింది. అప్పటి అధికార పార్టీ నాయకుల దందాల రానఫంగా.  కియా అనుబంధ పరిశ్రమను తమిళనాడుకు తరలించే ప్రయత్నాలూ జరిగాయి.   కియా పరిశ్రమ ఏర్పాటుకు చంద్రబాబు నాయుడు కృషి ప్రస్తుతం ఆ ప్రాంత అభివృద్ధికి ఎంతగానో ఉపయోగపడింది.  గతంలో భూములు అమ్ముకుందామంటే కొనే దిక్కులేదు.  కాని నేడు పరిస్థితి అందు కు పూర్తి భిన్నంగా ఉయారైంది.  అందుకే దార్శనికుడు పాలకుడితే రాష్ట్ర పురోగతి ఎలా ఉంటుందో కి యా పరిశ్రమ ను చూస్తేనే తెలుస్తుంది.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu