కొత్త రాజధాని ఏది..?

 

Hunt on for capital of Andhra Pradesh, Hunt on for capital

 

 

తెలుగు నేల రెండుగా విడిపోయింది 56 ఏళ్లుగా జరుగుతున్న పోరాట ఫలితంగా కాంగ్రెస్‌ పార్టీ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు అంగీకరించింది. అంతేకాదు వీలైనంత వేగం రాష్ట్ర ఏర్పాటు జరిగిలే చర్యలను కూడా మొదలు పెట్టింది.. ఈనేపధ్యంలో ఇప్పుడు అంతా కొత్త రాజదాని గురించే మాట్లాడుకుంటున్నారు. పదేళ్ల పాటు హైదరాబాద్‌ ఉమ్మడి రాజధానిగా కొనసాగిన తరువాత ఆంద్ర ప్రాంతానిక రాజధాని కానున్న నగరం గురించే అందరి ఆలోచన.

 


 రాజధాని నిర్మాణ పెద్ద విషయం కాకపోయినా ఇప్పుడు అలాంటి ప్రాంతాన్ని ఎంపిక చేయడమే అసలు సమస్య. రాజధాని ఏర్పాడేలంటే ఆ ప్రాంతాలకు అందుబాటులో ఉండటంతో పాటు, ప్రభుత్వ భవనాలకు స్థలాల లభ్యత, విమానాశ్రయం ఇతర రవాణ వసతులు ఇలా అన్ని సౌలభ్యాలను పరిగణలోకి తీసుకొని నిర్ణయిస్తారు. ఇలా చూస్తే విజయవాడ ప్రాంతం రాజధానిగా ఏర్పాడే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.



పెద్ద ఓడరేవు, రైల్వే స్టేషన్, విమానాశ్రయం, ఆయిల్ రిఫైనరీలు, స్టీల్ ప్లాంట్ ఇతర పరిశ్రములు ఇలా హైదరాబాద్‌కు దీటుగా అభివృద్ది చెందిన విశాఖ రాజధాని అయ్యే అవకాశం ఉంది. రాజమండ్రి ఒంగోలు లాంటి ప్రతిపాదనలు వచ్చినా అక్కడస్థలాల లభ్యత సమస్య ఉంది. అందుకే విజయవాడ-గుంటూరు నగరాల కలిపితే రాజధాని ఏర్పాటుకు అనుకూలంగా ఉంటుందన్నది నిపుణుల అభిప్రాయం. రాజధానిపై తుది నిర్ణయం తీసుకోవడానికి మత్రం మరింత సమయం పట్టే అవకాశం ఉందంటున్నారు నేతలు.