ఒకరిపై ఒకరు దుమ్మెత్తిపోసుకున్న హిల్లరీ, ట్రంప్..

 

అమెరికా అధ్యక్ష రేసులో ఉన్న డొనాల్డ్ ట్రంప్, హిల్లరీ క్లింటన్ ఇద్దరూ ఒకరిపై ఒకరు విమర్సనాస్త్రాలు సంధించుకున్నారు. అమెరికా అధ్యక్ష స్థానానికి ట్రంప్ తగిన వాడు కాదని..వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్న ట్రంప్ కు సంక్లిష్టమైన విదేశీ విధానాల పరంగా ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కొనేటంత సత్తా లేదన్నారు. గ్రేట్ బ్రిటన్ ను నిందించడం, అమెరికాపై క్షిపణులు ఎక్కుపెడతానని హెచ్చరిస్తున్న ఉత్తరకొరియా నేతను ప్రశంసించడం, నాటోలో అమెరికా సభ్యత్వాన్ని ప్రశ్నించడం తదితర సంఘటనలను హిల్లరీ ఉదాహరణలుగా పేర్కొన్నారు.

 

అయితే ట్రంప్ మాత్రం సైలెంట్ గా ఉంటాడా.. అసలే వివాదాస్పద వ్యాఖ్యలకు పెట్టింది పేరు. హిల్లరీ తనపై చేసిన కామెంట్లకు తాను కూడా ధీటుగా సమాధానం చెప్పాడు. కష్టకాలంలో ఉన్న అమెరికాకు అధ్యక్ష అభ్యర్థిగా హిల్లరీ సరిపోరని.. హిల్లరీ భర్త, అమెరికా మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్ ఓ రేపిస్ట్ అని ఆరోపించారు. ఇక పనిలో పనిగా ప్రస్తుత అమెరికా అధ్యక్షుడు ఒబామాపై కూడా విమర్శలు చేశారు. అమెరికా స్థాయిని చైనా ముందు డెవలపింగ్ కంట్రీగా (అభివృద్ధి చెందుతున్న దేశంగా) మార్చాడని.. ఆయనొక అవివేకి అని అన్నాడు. మరి ట్రంప్ వ్యాఖ్యలకు హిల్లరీ.. ఒబామా ఎలా స్పందిస్తారో చూడాలి.