నీట్‌ ఏడాది పాటు వాయిదా.. ఏపీ మంత్రుల హర్షం

 

నీట్‌ను ఏడాది పాటు వాయిదా వేస్తూ కేంద్రమంత్రి వర్గం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఆర్డినెన్స్‌ జారీ చేయనున్నట్లు కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి జేపీ నడ్డా తెలిపారు. కేంద్ర మంత్రి వర్గం ఇవాళ ప్రధాని కార్యాలయంలో సమావేశమై ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర ప్రభుత్వాల విజ్ఞప్తులను దృష్టిలో పెట్టుకుని కేంద్రం నీట్‌పై ఆర్డినెన్స్‌ను జారీ ఏసింది.

 

మరోవైపు నీట్‌ను ఏడాది పాటు వేయిదా వేస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయంపై ఏపీ మంత్రులు గంటా శ్రీనివాసరావు, కామినేని శ్రీనివాస్‌ హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మంత్రి గంటా మాట్లాడుతూ... తెలుగు రాష్ట్రాల విద్యార్థులకు ఇది ఎంతో ఉపశమనం కలిగించే అంశమన్నారు. నీట్‌ను వాయిదా వేయించేందుకు ఎన్నో ప్రయత్నాలు చేశామని మంత్రి కామినేని శ్రీనివాసరావు తెలిపారు. నీట్‌ అవసరం కానీ.. ప్రస్తుతం సిద్ధంగా లేమని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి జేపీ నడ్డాకు తెలిపామని చెప్పారు.