జగన్ ప్రభుత్వానికి హైకోర్టు జెల్ల
posted on Jul 19, 2022 12:00PM
జగన్ ప్రభుత్వానికి మరో షాక్ తగిలింది. ఐఆర్‌ఎస్ అధికారి జాస్తి కృష్ణ కిషోర్‌పై మంగళగిరి సీఐడీ పోలీ సులు నమోదు చేసిన కేసును కొట్టి వేస్తూ ఏపీ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది.
ఈడీబీ సీఇవోగా ఉన్నప్పుడు అవకతవకలకు పాల్పడ్డారంటూ జాస్తి కృష్ణ కిషోర్‌పై గతంలో వివిధ సెక్షన్ల కింద మంగళగిరి సీఐడీ పోలీసులు కేసులు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఈడీబీ సీఈవోగా ఉన్న ప్పుడు అవకతవకలకు పాల్పడ్డారని గతంలో సర్కార్ ఆయనపై సస్పెన్షన్ వేటు వేసింది. చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత మూడేళ్ల పదవీ కాలానికి ఆర్థిక అభివృద్ధి మండలి సీఈవోగా కృష్ణకిషోర్ పని చేశారు.
పరిశ్రమలు, మౌలిక వసతుల శాఖ నుంచి ప్రభుత్వం నివేదిక తెప్పించుకుని కేసు నమోదు చేశామని, అలాగే కృష్ణ కిశోర్‌పై కేసు నమోదు చేయాలని సీఐడీకి వైసీపీ ప్రభుత్వం ఆదే శాలు జారీ చేసింది. ఆరు నెలల్లోగా విచారణ పూర్తి చేయాలని సీఐడీకి సూచించిన ప్రభుత్వం విచారణ పూర్తయ్యే వరకు అమరావతి విడిచి వెళ్లకూడదని కృష్ణ కిశోర్‌కు అప్పట్లో ఆదేశాలు జారీ చేసింది. ఆయనపై సెక్షన్ 188, 403, 409, 120 బీ కింద సీఐడీ కేసులు నమోదు చేసింది.
తనపై నమోదైన కేసుపై జాస్తి కృష్ణకిషోర్ హైకోర్టును ఆశ్రయించారు. విచారణ జరిపిన హైకోర్టు కేసులపై ఆధారాలు సమర్పించ డంలో సీఐడీ విఫలమైందని పేర్కొంది. తాజాగా ఈ కేసులన్నింటినీ కొట్టివేస్తూ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది.