ఆర్కే గురించి చెప్పండి.. ఏపీ ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం...


ఆంధ్రా-ఓడిశా సరిహద్దు(ఏవోబీ) లో జరిగిన ఎన్ కౌంటర్లో చాలామంది మావోయిస్ట్ లు మరణించిన సంగతి తెలిసిందే. అయితే ఈ ఎన్‌కౌంట‌ర్లో ఆర్కేను పోలీసులు అదుపులోకి తీసుకున్నారని ఆర్కే భార్య శిరీష ఆరోపిస్తున్న సంగతి కూడా విదితమే. ఈ నేపథ్యంలోనే ఆర్కే భార్య శిరీష  హైకోర్టును ఆశ్ర‌యించారు.  ఏవోబీలో జ‌రిగిన ఎన్‌కౌంట‌ర్ త‌రువాత త‌న భ‌ర్త‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నార‌ని ఆమె పిటిషన్లో పేర్కొన్నారు. త‌న భ‌ర్త‌ను కోర్టు ముందు ప్ర‌వేశ‌పెట్టేలా ఆదేశాలు జారీ చేయాల‌ని కోరింది. అయితే దీనిపై విచారణ జరిపిన హైకోర్టు.. ఆర్కే ఆచూకీ త‌మ‌కు తెలియ‌జేయాలని ప్ర‌భుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. ఏదో జరిగిందని తమకూ అనుమానంగా ఉందని..  ఆర్కే చ‌నిపోయాడో పోలీసు క‌స్ట‌డీలో ఉన్నాడో తెల‌పాల‌ని ఆదేశించింది. ఆర్కేకు ఎలాంటి హానీ త‌ల‌పెట్ట‌కూడ‌దని.. దీనిపై పూర్తి వివ‌రాల‌తో కౌంట‌ర్ దాఖ‌లు చేయాల‌ని సూచించింది.