తల్లి పాలతో కొలెస్ట్రాల్ సమస్యకి చెక్

 

 

  Healthy Milk, Healthy Baby, mother and baby

 

 

మీ పిల్లలు భవిష్యత్తులో కొలెస్ట్రాల్ సమస్యలతో బాధపడకూడదంటే వారు పుట్టినప్పటి నుంచి రెండేళ్ళ వరకు చక్కగా తల్లిపాలు ఇవ్వండి అంటున్నారు లండన్ లోని సెయింట్ జార్జి మెడికల్ స్కూల్ పరిశోధకులు . తల్లిపాల గురించి ప్రపంచ వ్యాప్తంగా ఇంకా ఎన్నో పరిశోధనలు జరుగుతున్నాయి . తల్లిపాలలోని సుగుణాలు ఎన్నో బైటకి వస్తూనే వున్నాయి అయితే ఓ పరిశోధనలో చిన్నప్పుడు తల్లిపాలు తాగిన పిల్లలు తర్వాత తర్వాత కొలస్ట్రాలా బారిన పడరాని గుర్తించారు పరిశోధకులు. ఈ పరిశోధనలో భాగంగా టీనేజ్ లో వున్న1500 మందిని పరిశీలించారు. తర్వాత వారిలో ఎంతమంది తల్లిపాలు తాగి పెరిగారు , ఎంతమంది చిన్నతనంలో పోతపాలు మీద ఆధారపడ్డారన్నది వారి తల్లితండ్రులను ప్రశ్నించి తెలుసుకున్నారు . ఆ తర్వాత శిశువుల జీవనసరళినీ, వివిధ వయసుల్లో వారి కొలస్ట్రాల్ స్థాయిలు ఎలా వున్నాయన్నది అధ్యయనం చేసారు.

 

 లండన్ లోని సెయింట్ జార్జి మెడికల్ స్కూల్ పరిశోధకుల అధ్యయన ఫలితాలు చాలా ఆసక్తిగాకరంగా వుంటాయి. చిన్నతనంలో తల్లిపాలు తాగిన పిల్లలు పెరిగి పెద్దయ్యాక కొలెస్ట్రాల్ నిల్వలు తక్కువగా ఉండడం వల్ల వీరికి భవిష్యత్తులో గుండె జబ్బులు వచ్చే అవకాశం 10 శాతంగా  తగ్గుతుందని గుర్తించారు సో ఎలా చూసిన తల్లి పాలు శ్రేష్టం. అవి పిల్లల మేధస్సుకు, ఆరోగ్యానికి ఎంతో సహాయపడతాయి....

....రమ