ఏపీని కుదిపేస్తున్న‌ థూ.. ‘ఫ్యాన్’ మెయిల్

ఏపీకి అప్పులు పుట్ట‌కుండా,  పెట్టుబ‌డులు రాకుండా ఒక కుట్ర‌. అది కూడా విదేశాల నుంచి వైసీపీ  చేస్తోన్న పన్నాగం.   జ‌ర్మ‌నీలో ఒక ప్రముఖ సంస్థలో ప‌ని చేసే ఉద‌య్ భాస్క‌ర్ అనే ఒక వైసీపీ మ‌ద్ధ‌తుదారు చేత బాంబే ఎక్స్ ఛేంజీకి ఏకంగా 200 మెయిళ్లు పంపేలా చేశారంటే ప‌రిస్థితి ఏమిటో అర్ధం చేసుకోవ‌చ్చు.

ఈ విష‌యాన్ని ఏపీ  ఆర్ధిక మంత్రి ప‌య్యావుల  కేశ‌వ్ సీఎం చంద్ర‌బాబు దృష్టికి తీసుకొచ్చారు. ఆధారాల‌తో స‌హా చూపించారు. దీంతో ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు.. విచార‌ణ‌కు ఆదేశించారు. అంతే కాదు దీని వెన‌క ఎంత‌టి వారున్నా వ‌ద‌ల‌కూడ‌ద‌ని  స్పష్టం చేశారు. దీంతో పాటు.. ఈ విష‌యం ప‌బ్లిక్ లోకి మ‌రింత‌గా తీసుకెళ్లే బాధ్య‌త కూట‌మి నేత‌లు తీసుకోవాలని దిశానిర్దేశం చేశారు.  

ఈ విష‌యంపై స్పందించిన ఆర్ధిక శాఖ మాజీ మంత్రి, వైసీపీ సీనియర్ నాయకుడు బుగ్గ‌న‌... త‌మ హ‌యాంలో కూడా ఎంద‌రో ఇలాంటి క‌థ‌నాలు వండి వార్చారు. అలాగ‌ని మేము ఆగామా?  అంటూ లైట్ తీసుకునే మాట‌లు మాట్లాడారు. అంతే కాదు.. ఒక మెయిల్ వ‌ల్ల మీ రుణాలు, పెట్టుబ‌డులు ఆగిపోతాయా? అని ప్రశన్నించారు. అయితే.. బుగ్గన వ్యాఖ్యలకు స్పందించిన మంత్రి  ప‌య్యావుల కేశ‌వ్.. ఇది స్టేట్ ఫైనాన్షియ‌ల్ క్రెడిబిలిటీకి సంబంధించిన విష‌యంమన్నారు.  గ‌తంలో మీ హ‌యాంలో 2024 మార్చిలో 7 వేల కోట్ల‌కు ఇలాగే రుణం  కోసం ప్ర‌య‌త్నించారు. మీపై న‌మ్మ‌కం లేక పెట్టుబ‌డి దారులు రుణం ఇవ్వ‌లేదు. ఇది విశ్వాసానికీ, విశ్వసనీయతకూ సంబంధించిన అంశం కనుకే.. ఇటువంటి చర్యలను   దేశ ద్రోహం కింద తీసుకుని.. త‌ద్వారా.. కేసులు న‌మోదు చేయాల‌ని సీఎం చంద్ర‌బాబును కోరామని చెప్పారు.  

వైసీపీకి తొలి మొదటి నుంచీ ఇలాంటి అల‌వాటు ఉంద‌నీ, వారు రాష్ట్ర ప‌రువు ప్ర‌తిష్ట‌ల‌ను దెబ్బ తీయ‌డ‌మే ధ్యేయంగా  ప‌ని  చేస్తుంటార‌ని.. ఇప్ప‌టి వ‌ర‌కూ అదే జ‌రిగింద‌నీ అన్నారు. ఈ విష‌యంపై పూర్తి విచార‌ణ చేసి.. దీని వెన‌క ఎవ‌రున్నారో క‌నిపెట్టి తీరాల‌ని  పయ్యవుల కేశవ్ అన్నారు.  అయినా ఇలాంటి వాటి ద్వారా కూడా న‌ష్టం జ‌రుగుతుందా? అంటే ఇది వ‌ర‌కు హిడెన్ బ‌ర్గ్ రిపోర్ట్ అదాని సంస్థ‌ల‌ను తీవ్రంగా దెబ్బ తీయ‌లేదా? ఇదీ అలాంటిదేనన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ఈ కేసు ఏ మ‌లుపు తీసుకుంటుందో  చూడాలి మరి  అంటున్నారు రాజ‌కీయ విశ్లేష‌కులు. ఇలా విద్వేషపూరిత పనులు చేసే వారికి  విదేశాల్లో చాలా పెద్ద శిక్ష‌లే వేస్తారు. దానికి తోడు ఇది నైతిక‌త‌కు సంబంధించిన విష‌యం. ఇటీవ‌లి కాలంలో కొంద‌రి ఉద్యోగాలు స‌రిగ్గా ఇలాంటి అనైతిక కార్య‌క‌లాపాల  వ‌ల్లే పోయాయని గుర్తు చేస్తున్నారు.  ఉదయ్ భాస్క‌ర్ వంటి వారు ఇలాంటి చ‌ర్య‌ల‌కు పాల్ప‌డే ముందు ఆలోచించాల‌ని సూచిస్తున్నారు నిపుణులు. రాజ‌కీయ ఆరోప‌ణ‌లు చేయ‌డం వేరు. ఇలా ప‌క‌డ్బందీగా  రాష్ట్ర ప్ర‌యోజ‌నాల‌ను దెబ్బ తీసేవిధంగా వ్య‌వ‌హ‌రించ‌డం వేర‌ని.. ఇలాంటి వారికి గ‌ట్టిగా బుద్ధి చెప్ప‌కుంటే  కష్ట‌మ‌నీ సూచిస్తున్నారు రాష్ట్ర శ్రేయోభిలాషులు.