అక్బరుద్దీన్‌ జైలు: ఓయూ పోలీస్ స్టేషన్‌ కు..?

 

 

Hate speech row, Hyderabad Police arrest MIM leader, Akbaruddin Hate speech row

 

 

 

వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్‌పై ఓయూ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. శుక్రవారం ఓయూ పోలీస్ స్టేషన్‌లో అక్బరుద్దీన్ హాజరుకావాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ఆయనను హైదరాబాద్ తీసుకొచ్చేందుకు ఓయూ పోలీసులు సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఆయనను పీటీ వారెంట్‌పై అక్బరుద్దీన్‌ను తీసుకొచ్చే అంశంపై న్యాయ నిపుణులతో ఓయూ పోలీసులు చర్చిస్తున్నారు. ప్రస్తుతం అక్బరుద్దీన్ ఆదిలాబాద్ జిల్లా జైలులో ఉన్నాడు.


అయితే అక్బరుద్దీన్ ను హైదరాబాద్ కు తీసుకురావడంతో పాటు ఆయన చేసిన వివాదాస్పద వ్యాఖ్యల ప్రసంగాలను ప్రసారం చేసిన ఛానళ్లకు కూడా నోటీసులు ఇచ్చే అంశాన్ని న్యాయ నిపుణులతో చర్చిస్తున్నారు. ఆయా ఛానళ్లకు నోటీసులు జారీ చేసి ఆ ప్రసంగాలకు సంబంధించిన టేపులను అందించాల్సిందిగా కోరనున్నట్లు తెలుస్తోంది. అయితే అక్బరుద్దీన్ ను హైదరాబాద్ తీసుకురావడం కంటే అక్కడే విచారిస్తే సరిపోతుందని, పోలీస్ స్టేషన్ లో హాజరుపరిచేందుకు ఇంతదూరం తీసుకురావడం ఉద్రిక్తతలకు దారితీస్తుందని భావిస్తున్నారు.