వాళ్లు ప్రజాకంఠకులే

 

విభజన విషయంలో గత కొంతకాలంగా మౌనంగా ఉన్న మాజీ రాజ్యసభ సభ్యులు హరికృష్ణ మౌనం వీడారు. శుక్రవారం ఆయన తెలుగు ప్రజలకు ఓ బహిరంగ లేఖరు రాశారు. ఈ లేఖను తెలుగు జాతి మనో వేదన పేరుతో ఆయన విడుదల చేశారు. తెలుగు ప్రజలు కేవలం సమైఖ్యరాష్ట్రన్ని మాత్రమే కోరుకుంటున్నారని ఆయన స్పష్టం చేశారు.


లక్షకోట్ల ప్యాకేజీలు, రాజధాని, సమన్యాయం ఇవేవి తమకు అవసరం లేదని కేవలం సమైఖ్యరాష్ట్రమే తమకు కావాలని ఆయన పునరుద్ఘాటించారు. మూడు పేజీల లేఖను విడుదల చేసిన హరికృష్ణ, ఓట్లు, సీట్ల కోసమే రాష్ట్ర విభజన చేస్తున్నారని ఆరోపించారు. సీమాంధ్ర పార్లమెంటు సభ్యులు రాష్ట్ర ప్రయోజనాలను ఫణంగా పెట్టారని వమర్శించారు. విభజనకు సహకరించే ప్రతి వ్యక్తి ప్రజాకంఠకుడే అన్నారు.