మేయర్ మాజీద్.. ఇక మాజీ...

 

గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్‌లో కార్పొరేటర్లు ఈనెల 4వ తేదీ నుంచి మాజీలు అవ్వబోతున్నారు. ఈనెల 3వ తేదీతో వారి అయిదేళ్ళ పదవీకాలం ముగిసిపోతోంది. దాంతో ఈనెల 4వ తేదీ నుంచి జీహెచ్‌ఎంసీలో ప్రత్యేక అధికారుల పరిపాలన కొనసాగనుంది. పాలక మండలి గడువు బుధవారంతో ముగుస్తూ వుండటంతో మంగళవారం సాయంత్రం కార్పొరేటర్లకు జీహెచ్ఎంసీ కమిషనర్ సోమేష్ కుమారు వీడ్కోలు ఇవ్వనున్నారు. ఈ వీడ్కోలు సభలో కార్పొరేటర్లతోపాటు జలమండలి మేనేజింగ్ డైరెక్టర్, ట్రాఫిక్ అదనపు కమిషనర్ తదతరులు పాల్గొంటారు. జీహెచ్ఎంసీ పాలకమండలి పదవీకాలం ముగుస్తుండటంతో, ఇక హైదరాబాద్‌లో కూడా రాజకీయ వేడి పెరిగే అవకాశం వుంది. తెలంగాణ రాష్ట్రంలో అధికార టీఆర్ఎస్ ఈసారి హైదరాబాద్‌లో కూడా తన ప్రభావాన్ని చూపే ప్రయత్నం చేస్తోంది. దీని కోసం ఎంఐఎంతో పొత్తు పెట్టుకోవాలని భావిస్తోంది. మరి ఇంతకీ జీహెచ్ఎంసీ ఎన్నికలు ఎప్పుడు జరుపుతారో ఏలిన వారికే తెలియాలి...